టోవీనో థామస్ న్యూ మూవీ.. ఫస్ట్ లుక్ అదిరింది !

టోవీనో థామస్ న్యూ మూవీ.. ఫస్ట్ లుక్ అదిరింది !
X
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబిన్ జోసఫ్ రచించిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందిన ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది.

మలయాళ యంగ్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘నరివేట’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. టోవినో థామస్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని ఇండియన్ సినిమా కంపెనీ బ్యానర్‌పై గల్ఫ్ వ్యాపారవేత్తలు షియాస్ హసన్, టిప్పు షాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అబిన్ జోసఫ్ రచించిన స్క్రిప్ట్ ఆధారంగా రూపొందిన ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో.. టొవినో థామస్ అగ్రెసివ్ లుక్.. ఈ మూవీలో ఏ రేంజ్ లో ఎమోషన్స్ ఉంటాయో తెలియజేస్తోంది.

టొవినో తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఈ సినిమా ఒక పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని, అందులో ‘మరుపుకు వ్యతిరేకంగా జ్ఞాపకశక్తి పోరాటం’ అనే ప్రధాన అంశాన్ని పరిచయం చేస్తుందని వెల్లడించాడు. ఈ చిత్రంలో టొవినో థామస్‌తో పాటు ప్రఖ్యాత తమిళ నటుడు చేరన్, సురాజ్ వెంజారమూడు, ప్రియంవద కృష్ణ, ఆర్య సలీం, రినీ ఉదయకుమార్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చేరన్ ఈ చిత్రంతో మొదటిసారి మలయాళ సినీ ప్రపంచంలో అడుగుపెడుతున్నారు. కేరళలోని కుట్టనాడు, కవల, పులింకున్ను, చంగనాశేరి, వయనాడ్ ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు.

Tags

Next Story