"మార్కో" సినిమాకి సీక్వెల్... కానీ చిన్న ట్విస్ట్ !

మార్కో సినిమాకి సీక్వెల్... కానీ చిన్న ట్విస్ట్ !
X
ఈ సీక్వెల్‌కు "లార్డ్ మార్కో" అనే పేరును చిత్ర నిర్మాతలు మలయాళ ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈసారి హీరోగా ఉన్ని ముకుందన్ కాకుండా వేరే నటుడు నటించబోతున్నారని సమాచారం.

మలయాళంలో భారీ విజయం సాధించిన యాక్షన్ డ్రామా "మార్కో". ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా, మలయాళంలో అత్యంత హింసతో కూడిన చిత్రంగా ప్రచారం పొంది భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన తొలి మలయాళ ఏ-రేటెడ్ సినిమాగా ఒక కొత్త రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త బయటికొచ్చింది. ఈ సీక్వెల్‌కు "లార్డ్ మార్కో" అనే పేరును చిత్ర నిర్మాతలు మలయాళ ఫిల్మ్ ఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈసారి హీరోగా ఉన్ని ముకుందన్ కాకుండా వేరే నటుడు నటించబోతున్నారని సమాచారం. ప్రస్తుతం కొత్త హీరో కోసం అన్వేషణ జరుగుతోంది.

ఉన్ని ముకుందన్‌ను ఎందుకు మార్చారు అనే దానిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి కూడా హనీఫ్ అదేని దర్శకత్వం వహిస్తుండగా, షరీఫ్ ముహమ్మద్ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఉన్ని ముకుందన్ స్థానంలో కన్నడ రాక్ స్టార్ యశ్ నటిస్తున్నాడంటూ.. మాలీవుడ్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

Tags

Next Story