‘టాక్సిక్’ మూవీపై లేటెస్ట్ అప్టేట్ ఇదే !

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెరీర్‌లో ‘కేజీఎఫ్’ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రం అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించి, భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. హిందీ బెల్ట్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.
ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ అనే డిఫరెంట్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. గోవా మాదక ద్రవ్యాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాని మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కిస్తోంది. కెవిఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నయనతార, అక్షయ్ ఒబెరాయ్, హ్యూమా ఖురేషీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలని ముందుగా భావించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని డిసెంబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ తొలి వారంలో విడుదల చేసే అవకాశముందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే.. ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. యష్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
-
Home
-
Menu