మమ్ముట్టి ‘బజూకా’ చిత్రానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది !

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'బజూకా'. ఈ గేమ్ థ్రిల్లర్ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రతీ అప్‌డేటూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా చిత్రబృందం కౌంట్ డౌన్ ప్రారంభిస్తూ.. 'బజూకా' కొత్త పోస్టర్ విడుదల చేసింది.
ఇందులో మమ్ముట్టి ఒక భారీ యాక్షన్ సీన్ లోని ఒక పోజుతో అదరగొడుతున్నాడు. రోడ్డుపై తీసిన యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇక సినిమాకు 50 రోజులు మాత్రమే మిగిలివున్నాయి అని పోస్టర్‌లో మెన్షన్ చేశారు. 'బజూకా' చిత్రం చిత్రీకరణ 90 రోజుల్లో పూర్తయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను నూతన దర్శకుడు డీనో డెన్నిస్ తెరకెక్కించాడు. ప్రముఖ రచయిత కలూర్ డెన్నిస్ తనయుడు డీనో డెన్నిస్.. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం నిర్వహించాడు.
ఇందులో గౌతం వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించ నున్నారు. జగదీష్, షరఫుద్దీన్, సిద్ధార్థ్ భరతన్, సన్నీ వెయిన్, డీన్ డెన్నిస్, షైన్ టామ్ చాకో, స్ఫటికం జార్జ్, దివ్యా పిళ్ళై వంటి ప్రముఖ నటులతో పాటు అనేకమంది కొత్త నటీనటులు కూడా ఇందులో నటించారు. ఈ సినిమాను థియేటర్ ఆఫ్ డ్రీమ్స్, సరీగామా ఇండియా లిమిటెడ్ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్, జిను వి అబ్రహాం నిర్మించారు. ‘అన్వేషిప్పిన్ కండెత్తుమ్, కాప్ప’ వంటి చిత్రాల తర్వాత థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ నిర్మిస్తున్న మరో సినిమా ఇది.
Tags
-
Home
-
Menu