పన్నెండేళ్ళ తర్వాత మళ్లీ కలిసి నటిస్తోన్న అగ్రహీరోలు

పన్నెండేళ్ళ తర్వాత మళ్లీ కలిసి నటిస్తోన్న అగ్రహీరోలు
X

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, మెగాస్టార్ మమ్ముట్టి ఇద్దరూ చాన్నాళ్ళ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. అప్పుడే సినిమా షూట్ లో జాయిన్ అయిపోయారు కూడా. అందులో భాగంగానే సాల్ట్-అండ్-పెప్పర్ లుక్‌తో కనిపించటం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం ద్వారా వీరిద్దరూ దశాబ్దానికి పైగా విరామం తర్వాత తెరపై కలసి నటిస్తున్నారు. 2013లో వచ్చిన ‘కడల్ కడన్ను ఒరు మాతుకుట్టి’ చిత్రంలో చివరిసారిగా కలిసి నటించారు. అయితే ఆ చిత్రంలో మోహన్‌లాల్ తన అసలైన పాత్రలోనే కనిపించారు.

ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ గా యమ్ యమ్ యమ్ యన్ అని పిలుస్తున్నారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ రాజకీయ థ్రిల్లర్‌ను అంతో జోసెఫ్ నిర్మిస్తుండగా, సీఆర్ సలీమ్, సుభాష్ మాన్యుయెల్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే శ్రీలంక, అజర్‌బైజాన్, యుఏఈ, కోచి ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తయింది.

ఇక మోహన్‌లాల్ మరోవైపు సత్యన్ ఆంతిక్కాడ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హృదయపూర్వం’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్, సంగీత, ప్రేమలు ఫేమ్ సంజీత్ ప్రతాప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా మార్చి 27న విడుదల కానుండగా, తరుణ్ మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న తుడరుం చిత్రంలో కూడా ఆయన నటిస్తున్నారు.

మమ్ముట్టి విషయానికొస్తే ... ఆయన నటించిన ‘బజూకా’ చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది. యమ్ యమ్ యమ్ యన్ పూర్తైన తర్వాత, ఫ్యామిలీ ఫేమ్ నితీష్ సహదేవ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు ఆయన జాయిన్ కానున్నారు. అంతేకాకుండా, కొత్త దర్శకుడు జితిన్ కె జోస్ తెరకెక్కించిన ‘కలంకావల్’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags

Next Story