డ్రగ్స్ కేసులో పట్టుపడినా.. నో టు డ్రగ్స్ అంటున్నాడు

డ్రగ్స్ కేసులో పట్టుపడినా..  నో టు డ్రగ్స్ అంటున్నాడు
X
షైన్ ఇటీవల ఓ డ్రగ్ కేసులో చిక్కుకున్నాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ కోసం ఎంపికయ్యాడు.

మలయాళ సినిమా తన వినూత్న చిత్రాలకు పేరుగాంచింది. ఇప్పుడు వాళ్లు ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. "బెంగళూరు హై" అనే ఈ రాబోయే సినిమా డ్రగ్ దుర్వినియోగంపై దృష్టి సారిస్తోంది. ఇందులో షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షైన్ ఇటీవల ఓ డ్రగ్ కేసులో చిక్కుకున్నాడు. అయినప్పటికీ ఆశ్చర్యకరంగా ఈ ప్రాజెక్ట్‌లో లీడ్ రోల్ కోసం ఎంపికయ్యాడు.

షైన్ టామ్ చాకో డ్రగ్స్ సేవించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేసి, ఈ పబ్లిక్ అవేర్‌నెస్ ఫిల్మ్‌లో భాగం కావాలని నిర్ణయించాడు. ఈ చిత్రానికి వీకే ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ తాజాగా బెంగళూరులో లాంచ్ అయింది.ఈ సినిమాలో సిజు విల్సన్, క్వీన్ ఫేమ్ అశ్విన్ జోస్, బాబురాజ్, షాన్వి శ్రీవాస్తవ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

షైన్ టామ్ చాకో తన తండ్రిని ఇటీవల రోడ్డు ప్రమాదంలో కోల్పోయిన తర్వాత ఈ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని డాక్టర్ రాయ్ సీజే నేతృత్వంలోని కాన్ఫిడెంట్ గ్రూప్ నిర్మిస్తోంది. షైన్ టామ్ చాకో ఎమ్సీ జోసెఫ్ దర్శకత్వంలో "మీశ"లో కూడా కనిపించనున్నాడు. అలాగే, "అడినాశం వెళ్ళప్పొక్కం", "ది ప్రొటెక్టర్", "అంకం అట్టహాసం" వంటి చిత్రాల్లోనూ అతడు భాగం కానున్నాడు.

Tags

Next Story