నేను ఒక్కడ్నే కాదు ఇంకా ఉన్నారు : షైన్ టామ్ చాకో

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. పోలీసుల విచారణలో అతను కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు. షైన్ తాను మెథాంఫెటమిన్, గంజాయి ఉపయోగించానని ఒప్పుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కొందరు డ్రగ్స్ ఎలా సేకరిస్తారు? ఎలా ఉపయోగిస్తారనే విషయాలను కూడా వివరించాడు. ఇతర ప్రముఖ నటులు కూడా డ్రగ్స్ వాడుతున్నారని అతను సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తను విదేశీ మలయాళీ మహిళను కలవడానికి వేదాంత హోటల్‌కు వచ్చానని, ఆమెతో ఫోన్లో తరచూ మాట్లాడేవాడినని చెప్పాడు. డ్రగ్స్ సంబంధిత లావాదేవీలు జరిపినట్లు ఒప్పుకున్నాడు, కానీ ఎవరు, ఎప్పుడు ఆ లావాదేవీలు చేశారో తనకు గుర్తులేదని అన్నాడు. అసలు తనపై, మరో నటుడిపై ఎప్పుడూ నిందలు వస్తుంటాయని, కానీ వాస్తవానికి ఇతర ప్రముఖ నటులు కూడా డ్రగ్స్ వాడుతున్నారని షైన్ పోలీసులకు తెలిపాడు.
తన తండ్రికి సంబంధించిన ఆర్థిక వివాదంలో ఉన్న వ్యక్తులు తనపై దాడి చేయడానికి వస్తున్నారని భయపడి గది నుంచి పారిపోయానని చెప్పాడు. పోలీసుల విచారణలో షైన్ 2000 నుంచి 5000 రూపాయల వరకు కొన్ని లావాదేవీలు చేసినట్లు తేలింది. కానీ అవి డ్రగ్స్ కోసం కాదు, ఇతరులకు ఇచ్చిన అప్పులని అతను వివరించాడు.
తాను తరచూ మెథాంఫెటమిన్ వాడతానని, గంజాయిని సినిమా సెట్స్‌లో ఇతరులు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు ఉపయోగిస్తానని తెలిపాడు. తాను ఎప్పుడూ సెట్స్‌కు డ్రగ్స్ ఏర్పాటు చేయలేదని, కానీ “ప్రత్యేక ఏజెంట్లు” సినిమా లొకేషన్లకు డ్రగ్స్ సరఫరా చేస్తారని వెల్లడించాడు.
-
Home
-
Menu