మలయాళ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతోంది !

నజ్లెన్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన 'ప్రేమలు' చిత్రం ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలను పొందింది. మొదటి భాగం విజయవంతమైన వెంటనే రెండో భాగం తెరకెక్కుతుందనే ప్రకటన కొద్దికాలం క్రితమే చిత్ర బృందం నుంచి వెలువడింది. 'ప్రేమలు' విజయోత్సవంలో ఈ ప్రకటన జరిగి, 'ప్రేమలు 2' ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. 'ప్రేమలు 2' నిర్మాతలలో ఒకరైన దిలీష్ పోతన్, తన తాజా చిత్ర ప్రచార కార్యక్రమంలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. "మొదటి భాగంతో పోల్చుకుంటే 'ప్రేమలు 2' పెద్ద కేన్వాస్‌లో తెరకెక్కనుంది. ఈ ఏడాది జూన్‌లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఏడాది చివరికి సినిమా థియేటర్లలోకి రానుంది. స్క్రిప్ట్ పూర్తయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. జూన్ మధ్యలో మొదటి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మూడు లేదా నాలుగు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేశాం," అని దిలీష్ తెలిపారు.
గిరీష్ ఎడీనే ఈ రెండో భాగానికి దర్శకత్వం వహిస్తారు. 'ప్రేమలు 2' ఇంకా వినోదాత్మకంగా, ప్రేక్షకులను మరింత ఉత్సాహపరిచేలా ఉంటుందని గతంలో గిరీష్ పేర్కొన్నారు. మొదటి భాగం ముగింపు నజ్లెన్ పాత్ర యూకేకు ఉద్యోగం కోసం వెళ్ళే క్షణాలతో ముగుస్తుంది. స్వభావికంగానే 'ప్రేమలు 2'లో కథ అక్కడి నుండే కొనసాగుతుందా? యూకేలో షూటింగ్ ఉంటుందా? అనే ప్రశ్నకు గిరీష్, "సమయానికి అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది" అని పేర్కొన్నారు.
మొదటి భాగంలోని ముఖ్య పాత్రలు రెండో భాగంలోనూ ఉంటాయని, కథ ఇంకా విస్తృతమైన కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతుందని దర్శకుడు తెలిపారు. ప్రధానంగా మలయాళంలో నిర్మితమైన ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో కూడా విడుదల కానుంది. నజ్లెన్, మమిత బైజు తోపాటు శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్, మీనాక్షి రవీంద్రన్, ఆల్తాఫ్ సలీమ్ ముఖ్యపాత్రలు పోషించారు.
-
Home
-
Menu