దుల్కర్ ‘ఐయామ్ గేమ్’ లో వెబ్ సిరీస్ భామ

దుల్కర్ ‘ఐయామ్ గేమ్’ లో వెబ్ సిరీస్ భామ
X
సంయుక్త విశ్వనాథన్,.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ సినిమా 'ఐయామ్ గేమ్' లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది.

‘ఓమన పెణ్ణే, సుళల్, స్వీట్ కారమ్ కాఫీ’ వంటి వెబ్‌ సిరిస్ తో, అలాగే... సాయ్ అభ్యంకర్‌తో కలిసి చేసిన వైరల్ సాంగ్ కచ్చి సేరాలో నటించి గుర్తింపు పొందిన సంయుక్త విశ్వనాథన్,.. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మలయాళ సినిమా 'ఐయామ్ గేమ్' లో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె మలయాళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది.

‘ఆర్ డీ ఎక్స్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక క్రీడా నేపథ్య థ్రిల్లర్‌గా రూపొందు తోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో పాటు, అంటోని వర్గీస్, తమిళ నటుడు, దర్శకుడు మిస్కిన్, ‘పరియేరుమ్ పెరుమాళ్’ నటుడు కదిర్, ‘కిల్’ సినిమాతో ప్రాచుర్యం పొందిన పార్థ్ తివారి వంటి ప్రముఖులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వేఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ అండ్ జాన్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా, మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ త్రివేండ్రంలో ప్రారంభమైంది. ఈ సినిమాలో సంయుక్త విశ్వనాథన్ పాత్ర ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Tags

Next Story