ఆధ్యాత్మిక ఆనందంలో సంయుక్త మీనన్ !

అందాల మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వివిధ ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది. ఇటీవల ఆమె మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్ వెళ్లి గంగా నదిలో పవిత్ర స్నానం చేసింది. ఆ అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ సంస్కృతిని తనలో ఎప్పటికీ సజీవంగా ఉంచుకుంటానని, ఇది అపారమైన ఆత్మస్ఫూర్తిని అందించేదని, మనస్సును పోషించేదని భావోద్వేగంతో తెలిపింది.
ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తూ, తాజాగా అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా సంయుక్త ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు షేర్ చేసింది. నుదుటిన కుంకుమ బొట్టుతో, పూజలో అందుకున్న మాలలను చేతపట్టి దర్శనమిచ్చిన ఆమె.. నీలి రంగు భారతీయ వస్త్రధారణలో కాంతిమంతంగా మెరిసిపోతూ కనిపించింది. “కామాఖ్య” అని ఒక్క మాటతో తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది.
వృత్తిపరంగా మాట్లాడితే, సంయుక్త ప్రస్తుతం బిజీ షెడ్యూల్‌తో ఉంది. ఆమె నిఖిల్ సిద్ధార్థ్ సరసన ‘స్వయంభు’, శర్వానంద్‌తో ‘నారి నారి నడుమ మురారి’, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్ట్‌తో సహా పలు చిత్రాల్లో నటిస్తోంది.
-
Home
-
Menu