డైరెక్టర్ గా సాయి పల్లవి.. హీరో ఎవరు?

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సహజమైన నటనతోనూ, మెస్మరైజింగ్ డ్యాన్సింగ్ స్కిల్స్ తోనూ విపరీతమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఆమెకు కేవలం నటన మీదే కాకుండా, డైరెక్షన్ పై కూడా ఆసక్తి ఉందని తాజాగా నాగచైతన్య వెల్లడించాడు. చైతన్య, సాయి పల్లవి నటించిన 'తండేల్' మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ నిర్వహించారు.
అందులో 'డైరెక్షన్ పై ఆసక్తి ఉందా' అని అడిగిన ప్రశ్నకు సాయి పల్లవి 'లేదు' అని సమాధానమిచ్చింది. అయితే చైతూ వెంటనే ఇది అబద్దమని చెబుతూ, 'తను డైరెక్షన్ చేస్తానని, తన సినిమాకు నన్ను హీరోగా తీసుకుంటానని గతంలో చెప్పింది' అని రివీల్ చేశాడు. దానికి సాయి పల్లవి కూడా అవునని సమాధానమిచ్చింది. దీంతో భవిష్యత్తులో సాయి పల్లవి దర్శకత్వం వైపు అడుగులు వేస్తుందా? అన్న చర్చ మొదలైంది.
ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ డైరెక్టర్స్ కు ఏమాత్రం కొదవలేదు. వారిలో ఎక్కువమంది నటన నుంచి దర్శకత్వం వైపు అడుగులు వేసిన వారే. మరి.. మునుముందు సాయి పల్లవికి కూడా డైరెక్టర్ గా చూసే అవకాశం వస్తుందేమో చూడాలి. మరోవైపు.. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో రణ్‌బీర్ కపూర్ తో 'రామాయణ' చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది. ఇంకా.. పలు సౌత్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ కూడా ఈ నేచురల్ బ్యూటీ కిట్టీలో ఉన్నాయి.
Tags
-
Home
-
Menu