‘రొంత్’ విడుదలయ్యేది అప్పుడే !

ప్రముఖ రచయిత, దర్శకుడు షాహి కబీర్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘రొంత్’. ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. జూన్ 13న చిత్రం థియేటర్లలోకి రానుంది. విడుదల తేదీని తెలియజేసే సందర్భంగా రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్ రివీల్ అయిన కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
ఈ సినిమా ఒక నైట్-టైం కాప్ డ్రామాగా రూపొందుతోంది. రాత్రి షిఫ్ట్‌లో విధులు నిర్వహించే పోలీసుల జీవితాలు, వారు ఎదుర్కొనే సవాళ్లు ఈ కథకు ప్రధానంగా ఉంటాయని సమాచారం. పోలీస్ నేపథ్యంలో సాగే కథల్లో ఇది షాహి కబీర్‌కు ఐదవ చిత్రం కాగా.. దర్శకత్వం పరంగా.. ఇది ఆయన రెండో ప్రయత్నం. గతంలో ‘ఇల వీళా పూంచీర’ అనే విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన షాహి.. ‘జోసఫ్’, ‘నాయాట్టు’, ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వంటి విజయవంతమైన పోలీస్ థ్రిల్లర్లకు రచయితగా పనిచేశారు.
ఈ సినిమాలో రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్‌లతో పాటు రాజేష్ మాధవన్, సుధీ కొప్ప, అరుణ్ చెరుకవిల్, లక్ష్మి మీనన్, కృష్ణ కురుప్, రోషన్ అబ్దుల్ రహూఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని అనిల్ జాన్సన్ అందించగా, సినిమాటోగ్రఫీకి మనేశ్ మాధవన్, ఎడిటింగ్‌కి ప్రవీణ్ మంగళత్ పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వినీత్ జైన్, రతీష్ అంబాట్, రెంజిత్ ఈవీఎం, జోజో జోస్ కలిసి నిర్మిస్తున్నారు. ఫెస్టివల్ సినిమాస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.
-
Home
-
Menu