‘కాట్టాళన్’ మూవీలో రజిషా విజయన్

‘కాట్టాళన్’ మూవీలో రజిషా విజయన్
X
స్టార్ యాక్ట్రెస్ రజిషా విజయన్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘మార్కో’ ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, తెలుగు నటుడు సునీల్, సీనియర్ యాక్టర్స్ జగదీష్, సిద్దిఖ్, కూల్ రాపర్ బేబీ జీన్‌లతో కాస్ట్ ఫిక్స్ చేశారు.

ఆంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ‘కాట్టాళన్’ మలయాళ సినిమా కాస్ట్ లైనప్ రోజురోజుకూ సూపర్ ఎక్స్‌పైరింగ్‌గా మారుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, స్టార్ యాక్ట్రెస్ రజిషా విజయన్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘మార్కో’ ఫేమ్ కబీర్ దుహాన్ సింగ్, తెలుగు నటుడు సునీల్, సీనియర్ యాక్టర్స్ జగదీష్, సిద్దిఖ్, కూల్ రాపర్ బేబీ జీన్‌లతో కాస్ట్ ఫిక్స్ చేశారు. ఈ మల్టీ-స్టార్ లైనప్‌తో కట్టలన్ ఇప్పటికే హైప్ క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాను ఫస్ట్ టైమ్ డైరెక్టర్ పాల్ జార్జ్ తెరకెక్కిస్తున్నారు. ‘కాట్టాళన్’ ను ఓ ఫుల్-ఆన్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రెజెంట్ చేయబోతున్నారు. అదీ కూడా నెక్స్ట్ లెవెల్ విజువల్స్‌తో. సినిమాటోగ్రఫీ రెనాదివే హ్యాండిల్ చేస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు షమీర్ ముహమ్మద్‌కు అప్పగించారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే, ‘కాంతార’ తో ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు. ఈ టెక్నికల్ టీమ్‌తో కట్టలన్ ఓ విజువల్ ట్రీట్ అవ్వడం పక్కా.

మార్కో సినిమాతో నిర్మాతగా సక్సెస్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చిన షరీఫ్ ముహమ్మద్ ఈ చిత్రాన్ని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బ్యాంక్‌రోల్ చేస్తున్నారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకపోయినా, ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ‘కాట్టాళన్’ మూవీని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ .. అయిదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు, అదీ పాన్ ఇండియా లెవెల్‌లో. ‘కాట్టాళన్’ మూవీతో ఆంటోనీ వర్గీస్ మరోసారి తన మాస్ యాక్షన్ అవతార్‌ను చూపించ బోతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.



Tags

Next Story