ఆసక్తిని రేపుతున్న పృధ్విరాజ్ ‘విలాయత్ బుద్ధ’

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, తెలుగు ఆడియన్స్‌ని 'సలార్'తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం యస్ యస్ యంబీ 29 లో నటిస్తున్నాడు. ఇతర భాషల సినిమాల విషయంలో పృథ్వీరాజ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. తన పాత్రకు గట్టి ప్రాముఖ్యత లేకపోతే.. సాధారణంగా బయటి ప్రాజెక్ట్‌లకు దూరంగా ఉంటాడు. ఇప్పుడు అతని తాజా చిత్రం 'విలాయత్ బుద్ధ' రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ సినిమా టీజర్ తెలుగుతో పాటు ఇతర పాన్-ఇండియా భాషల్లో విడుదలైంది.
టీజర్ మొదటి ఫ్రేమ్ నుంచి చివరి షాట్ వరకు చాలా మందికి 'పుష్ప' సినిమాని గుర్తు చేస్తోంది. అంతేకాదు, ఒక సీన్‌లో పోలీస్ ఆఫీసర్ హీరోని ఎగతాళి చేస్తూ, “నీవు పుష్ప అనుకుంటున్నావా?” అని అడుగుతాడు. దానికి పృథ్వీరాజ్, “అతను ఇంటర్నేషనల్, నేను లోకల్” అని సమాధానమిస్తాడు. ఇలాంటి సన్నివేశాలు ఫ్యాన్స్‌లో పృథ్వీరాజ్ ఎందుకు 'పుష్ప'ని పోలిన సినిమాని ఎంచుకున్నాడనే అనుమానాలు రేకెత్తించాయి.
దీన్ని అర్థం చేసుకోవాలంటే... 2020లో మలయాళ రచయిత జిఆర్ ఇందుగోపన్ రాసిన 'విలాయత్ బుద్ధ' నవల గురించి తెలుసుకోవాలి. ఈ నవల భారీ విజయం సాధించి, విపరీతంగా అమ్ముడైంది. కథ విషయానికొస్తే .. ఒక స్కూల్ టీచర్ తన ఇంటి పెరట్లో చాలా అరుదైన , ఎంతో విలువైన చందనం చెట్టుని రహస్యంగా పెంచుతాడు. ఒక స్మగ్లర్ ఆ చెట్టుని గుర్తించి.. దాన్ని కొట్టి కోట్లు సంపాదించా లనుకుంటాడు. ట్విస్ట్ ఏంటంటే.. ఆ స్మగ్లర్ టీచర్‌కి మాజీ విద్యార్థి. వీరి మధ్య కాన్ఫ్లిక్ట్ త్వరలో గ్రామం మొత్తానికి వ్యాపిస్తుంది. చివరకు అది మాఫియాతో కనెక్ట్ అవుతుంది.
-
Home
-
Menu