సీక్వెల్స్ క్రేజ్ కు కారణం రాజమౌళి నే : పృథ్వీరాజ్ సుకుమారన్

మలయాళ టాప్ స్టార్, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్.. భారతీయ చిత్రసీమలో సీక్వెల్స్ పాపులారిటీకి కారణం ఒక వ్యక్తి విజన్ అని అంటున్నాడు. అతనే ఎస్.ఎస్. రాజమౌళి. ‘‘బాహుబలి’’ సినిమాకన్నా ముందే ఇండియన్ స్ర్కీన్ పై సీక్వెల్స్ వచ్చాయి. కానీ ‘‘బాహుబలి 2’’ అఖండ విజయంతో ఆడియన్స్‌లో విశ్వాసాన్ని కలిగించింది. అదే ఇతర ఇండస్ట్రీలలోనూ రెండు భాగాల కథలను తీసుకొచ్చేలా చేసింది.
ఈ ధోరణిని కొనసాగిస్తూ.. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన మోహన్ లాల్ ‘‘లూసిఫర్’’ చిత్రం అద్భుత విజయం సాధించింది. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అదే కథను ‘‘గాడ్‌ఫాదర్’’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు పృథ్వీరాజ్, ‘‘L2: ఎంపురాన్’’ పేరుతో ‘‘లూసిఫర్’’ సీక్వెల్‌ను రూపొందించాడు. ఈ చిత్రం మార్చి 27, 2025న మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ‘‘బాహుబలి’’ సినిమా, అలాగే ‘‘పుష్ప’’, ‘‘పుష్ప 2’’ విజయాలు.. ప్రేక్షకులు మల్టీ-పార్ట్ కథలను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని నిరూపించాయి అని చెప్పాడు. ఇదే సందర్భంలో అతడు మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే ‘‘సలార్ 2’’ చిత్రంలో తాను ప్రభాస్ స్నేహితుడిగా కంటిన్యూ చేస్తున్నట్టు , ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్టు తెలిపాడు.
-
Home
-
Menu