‘నోబడీ’ అంటున్న పృధ్విరాజ్ సుకుమారన్

పృధ్విరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెరైటీ చిత్రం "నోబడీ". దీనికి నిస్సాం బషీర్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా కొచ్చిలో ఘనంగా ప్రారంభమైంది. వెల్లింగ్టన్ దీవిలో నిర్వహించిన పూజా కార్యక్రమం మరియు స్విచ్ ఆన్ సెర్మనీకి చిత్ర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ చిత్రాన్ని పృధ్విరాజ్ ప్రొడక్షన్స్, ఈ4 ఎక్స్‌పెరిమెంట్స్ బ్యానర్లపై సుప్రియా మేనన్, ముకేష్ మెహతా, సీవీ సారథి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
"నోబడీ" చిత్రంతో పృధ్విరాజ్, పార్వతి జోడీగా ఐదవ సారి స్క్రీన్ పై కనిపించనున్నారు. గతంలో వీరిద్దరూ ‘సిటీ ఆఫ్ గాడ్, ఎన్ను నిండే మొయిదీన్, మై స్టోరీ, కూడే’ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సినిమాలో హకీమ్ షాజహాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే అశోకన్, మధుపాల్, లుక్‌మాన్ అవరాన్, గణపతి, వినయ్ ఫోర్ట్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
"నోబడీ" చిత్రం కోసం నిస్సాం బషీర్ మళ్లీ రచయిత సమీర్ అబ్దుల్ తో కలిసి పని చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన "రోషాక్" చిత్రం మమ్ముట్టిని ప్రధాన పాత్రలో చూపుతూ మంచి విజయాన్ని సాధించింది. సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రమేశ్వర్ ఎంపికయ్యారు. ఆయనకు ‘అర్జున్ రెడ్డి , యానిమల్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు ఉంది. ఈ కథా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి రానున్నాయి.
-
Home
-
Menu