ఆకట్టుకుంటున్న ప్రణవ్ హారర్ చిత్రం ఫస్ట్ లుక్ !

ఆకట్టుకుంటున్న ప్రణవ్ హారర్ చిత్రం ఫస్ట్ లుక్ !
X
ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా.. "డియెస్ ఇరే’ అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు.

హారర్ థ్రిల్లర్ చిత్రాలను విజయవంతంగా తెరకెక్కిస్తున్న దర్శకుడు రాహుల్ సదాశివన్ మూడో సారి అదే జానర్‌లో మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా.. "డియెస్ ఇరే’ అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో మధ్యలో ఓ మిస్టరీలా కనిపించే మహిళ కూర్చుని ఉంది. ఆమె చుట్టూ వికృతమైన ఆకారాలుగా ఉన్న భయంకర రూపాలు చూపిస్తూ, చిత్రానికి శక్తివంతమైన అంధకార వాతావరణాన్ని, ఓకల్ట్ థీమ్స్‌ను స్పష్టంగా చాటుతోంది.

‘డియెస్ ఇరే’ అనే లాటిన్ పదానికి తెలుగులో ఆగ్రహదినం అనే అర్ధం తీసుకోవచ్చు. ఈ చిత్రం 2025 అక్టోబర్ 31న, అంటే హాలోవీన్ రోజున విడుదల కాబోతుంది. హాలోవీన్ భయానకతకు ప్రతీక, అర్ధరాత్రి రహస్యాలకు ప్రతినిధిగా నిలిచే పండుగ కావడంతో... ఈ చిత్రం విడుదల తేదీకి ఆత్మీయ సంబంధం ఉంది. రాహుల్ సదాశివన్ ఈ చిత్రంతో తన మూడో హారర్ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. ఆయన గత హారర్ చిత్రాలు ‘భూతకాలం, భ్రమయుగం’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ మంచి కమర్షియల్ విజయాన్ని సాధించింది.

"డియెస్ ఇరే" చిత్రానికి రాహుల్ సదాశివన్ గతంలో పనిచేసిన సాంకేతిక నిపుణులతో కలిసి పని చేస్తున్నారు. ఈ సినిమాను రామచంద్ర చక్రవర్తి, ఎస్. శశికాంత్ సంయుక్తంగా నైట్ షిఫ్ట్ స్టూడియోస్ మరియు వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ప్రణవ్ మోహన్‌లాల్ అభిమానులతో పాటు, హారర్ సినిమాల అభిమానులూ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా జనాన్ని ఏ రేంజ్ లో భయపెడుతుందో చూడాలి.

Tags

Next Story