ప్రణవ్ ‘డైస్ ఇరే’ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది !

యంగ్ డైనమైట్ ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న మలయాళ థ్రిల్లర్ మూవీ ‘డైస్ ఇరే’. దీనికి ‘భ్రమయుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకుడు. ప్రణవ్ మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా.. అతని ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఎరుపు రంగు థీమ్‌తో కూడిన ఆకర్షణీయమైన పోస్టర్‌లో ప్రణవ్ సోఫాలో విశ్రాంతిగా కూర్చొని, సిగరెట్ తాగుతూ, డ్రింక్ పట్టుకొని ఉన్నాడు. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న సీసాలు. ఇంకా స్పృహతప్పిన వ్యక్తులు కనిపిస్తున్నారు. వెనుక ఒక దెయ్యం ముఖం కనిపించడం చిత్రం యొక్క భయానక ధోరణిని మరింత బలపరుస్తుంది.
‘డైస్ ఇరే’ అనే లాటిన్ పదం 'రాగ్ ఆఫ్ రాత్' అని అర్థం. ఇది మధ్యయుగ కవితకు సూచన. ఈ చిత్రం హాలోవీన్ సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇది దర్శకుడు రాహుల్ కు వరుసగా మూడవ హారర్ ప్రాజెక్ట్. ఇంతకుముందు ‘భూతకాలం, బ్రమయుగం’ లాంటి చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మమ్ముట్టి నటించిన ‘భ్రమయుగం’ వాణిజ్యపరంగా కూడా విజయవంతమైంది.
మలయాళ చిత్ర పరిశ్రమలో హారర్ ప్రాజెక్టులు గణనీయంగా పెరుగుతున్నాయి. డైస్ ఇరేతో పాటు, కథనార్ – ది వైల్డ్ సోర్సరర్ వంటి భారీ బడ్జెట్ చిత్రాల నుండి నైట్ రైడర్స్, ప్రకాంబనం, ఇంకా కరక్కం వంటి హారర్ కామెడీల వరకు అనేక ఇతర చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. జోంబీ చిత్రాలైన వల, మంజేశ్వరం మాఫియా, మరియు ‘జాంబి’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి, ఇది దర్శకులు మరియు ప్రేక్షకులలో ఈ జానర్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని సూచిస్తుంది.
-
Home
-
Menu