ప్రణవ్ మోహన్‌లాల్ చిత్రానికి వెరైటీ టైటిల్

‘భ్రమయుగం’ వంటి హారర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాహుల్ సదాశివన్ తన తదుపరి చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించాడు. ఈ నూతన హారర్ థ్రిల్లర్‌కు అధికారికంగా "డయేస్ ఇరే" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ హీరో మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనుండగా.. ఇది అతడికి హారర్ జానర్‌లో తొలిసారి.
ఈ టైటిల్‌తో పాటు విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ రహస్యమయంగా, భయానకంగా ఉండడం ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రాహుల్ సదాశివన్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 24, 2025న షూటింగ్ ప్రారంభమై, చాలా తక్కువ సమయంలో, ఏప్రిల్ 29న పూర్తిగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. స్టూడియో వై నాట్ మరియు నైట్ షిఫ్ట్ స్టూడియో బ్యానర్‌లపై ఈ సినిమా నిర్మించబడుతోంది. సంగీతాన్ని క్రిస్టో జెవియర్ అందించగా, ఇదివరకు బ్రహ్మయుగం చిత్రానికి కూడా ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేశారు.
ప్రణవ్ మోహన్‌లాల్ విషయానికి వస్తే.. అతడు చివరిసారిగా ‘వర్షంగళ్కు శేషం’ అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ‘హృదయం’ తర్వాత ఆయన – వినీత్ శ్రీనివాసన్ కాంబినేషన్‌లో వచ్చిన రెండవ చిత్రం కావడం గమనార్హం.
-
Home
-
Menu