మలయాళ నటి శ్వేతామీనన్ పై పోలీస్ కేస్ !

ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్‌పై సంచలన కేసు నమోదైంది. ఆమె అశ్లీల చిత్రాలు, ప్రకటనలలో నటించి... ఆర్థిక లాభం పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. పబ్లిక్ యాక్టివిస్ట్ మార్టిన్ మెనచెరీ... శ్వేతా మీనన్ చేసిన కొన్ని పనులు సమాజంలో అనైతికంగా ఉన్నాయని భావించి.. ఎర్నాకులం సీజేఎం కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. స్థానిక పోలీసులకు కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దీంతో, శ్వేతా మీనన్‌పై ఈ కేసు ఫైల్ అయ్యింది. శ్వేతా మీనన్ మలయాళ సినిమా ఇండస్ట్రీలో ఓ ఐకానిక్ పెర్సనాలిటీ. ‘రతినిర్వేదం’ వంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాయి. ఆమె బోల్డ్ అండ్ బ్రేవ్ ఇమేజ్‌తో ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. కేవలం మలయాళం మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో కూడా ఆమె తన మార్క్ చూపించింది. భానుచందర్ దర్శకత్వంలో రూపొందిన ‘దేశద్రోహులు’ చిత్రంతో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్వేతా మీనన్ .... ఆ తర్వాత ‘ఆనందం’, ‘జూనియర్స్’, ‘రాజన్న’ వంటి తెలుగు చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది.
అయితే.. ఈ ఆరోపణలపై శ్వేతా మీనన్ ఇప్పటివరకు నోరు విప్పలేదు. ఆమె నుంచి ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్ లేదా స్పందన రాలేదు. ఈ కేసు ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఈ ఆరోపణల వెనుక నిజమెంత ఉంది? అనేది తెలియాలంటే, ఇంకా సమయం పట్టొచ్చు. ప్రస్తుతానికి, ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
-
Home
-
Menu