ఓటీటీలోకి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ !

ఓటీటీలోకి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ !
X
ఈ ఏడాది ఫిబ్రవరి 20 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది.

కుంచాక్కో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ఈ ఏడాది ఫిబ్రవరి 20 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. దాదాపు ఒక నెల తర్వాత.. ఈ చిత్ర నిర్మాణ బృందం సినిమా ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. మార్చి 20 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.

ఈ ప్రకటనను షేర్ చేస్తూ.. ‘కొత్త ఆఫీసర్ వచ్చేస్తు్న్నాడు.. స్టాండ్ ఇన్ లైన్ అండ్ సెల్యూట్. ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మార్చి 20న నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వీక్షించండి" అంటూ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

కుంచాక్కో బోబన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హరిశంకర్‌ పాత్రలో నటించారు. కఠినమైన స్వభావం కలిగిన హరిశంకర్ తన భార్య, పిల్లలతో కలిసి కొచ్చీలో నివసిస్తుంటాడు. ఓ నకిలీ బంగారు ఆభరణాల కేసు విచారణ బాధ్యత అతనికి అప్పగించబడుతుంది. అయితే ఈ కేసు సాధారణంగా అనిపించినా, విచారణలో మలుపులు తిరుగుతూ భయంకరమైన రహస్యాలను వెలుగులోకి తెస్తుంది. ఈ కేసును చేధించి దోషులను పట్టుకునే హరిశంకర్ ప్రయాణమే ఈ సినిమా కథ.

Tags

Next Story