నివీన్ పాలీ ‘బేబీ గాళ్’ షూటింగ్ పూర్తి !

మాలీవుడ్ యూత్ స్టార్ నివిన్ పాలీ నటిస్తున్న తాజా థ్రిల్లర్ చిత్రం ‘బేబీ గాళ్’. ‘గరుడన్’ (మలయాళం) దర్శకుడు అరుణ్ వర్మ రూపొందించిన ఈ సినిమా, తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో లిజోమోల్ జోస్, అదితి రవి, ప్రేమలు ఫేమ్ సంగీత్ ప్రతాప్, ‘మార్కో’ ఫేమ్ అభిమన్యు తిలకన్, అజీజ్ నెడుమంగడ్, మరియు అశ్వంత్ లాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ రచయితల ద్వయం బాబీ మరియు సంజయ్ (ట్రాఫిక్, అయాళుం న్యానుం తమ్మిల్, ముంబై పోలీస్, కానెక్కానే’ లాంటి చిత్రాల రచయితలు) ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించారు.
‘బేబీ గాళ్’ సినిమాకు ఫైజ్ సిద్దిక్ సినిమాటోగ్రఫీ, షైజిత్ కుమారన్ ఎడిటింగ్, జేక్స్ బిజోయ్ సంగీతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని లిస్టిన్ స్టీఫెన్ మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. నివిన్ , లిస్టిన్ స్టీఫెన్ కలిసి పనిచేస్తున్న ఐదో చిత్రం ఇది (‘ట్రాఫిక్, తురముఖం, రామచంద్ర బాస్ అండ్ కో, మలయాళీ ఫ్రమ్ ఇండియా’ తర్వాత).
నివిన్ పాలీ వేరే పలు ప్రాజెక్టుల్లోనూ బిజీగా ఉన్నాడు. తమర్ కె.వి దర్శకత్వంలో ‘డాల్బీ దినేశన్’, కొత్త దర్శకులు సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్‌ల ‘డియర్ స్టూడెంట్స్’, ఆదిత్యన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ‘మల్టీవర్స్ మన్మథన్’, అనురాజ్ మనోహర్ రూపొందిస్తున్న ‘శేఖర వర్మ రాజావు’, ‘యాక్షన్ హీరో బిజు’ సీక్వెల్‌ను అబ్రిడ్ షైన్ దర్శకత్వంలో, కొత్త దర్శకుడు ఆర్యన్ రమణి గిరిజావల్లభవన్ దర్శకత్వంలో ఓ అన్టైటిల్డ్ చిత్రం.. ఇంకా రామ్ దర్శకత్వంలో తమిళ చిత్రం ‘ఏళు కడల్ ఏళు మలై’ లో నటిస్తున్నారు. అలాగే.. ప్రేమం నటుడు నివిన్ ఈ ఏడాది తన తొలి వెబ్ సిరీస్ ఫార్మాతో జియోహాట్‌స్టార్‌లో అడుగుపెడుతున్నాడు.
-
Home
-
Menu