నిఖిలా విమల్ వెరైటీ చిత్రం ప్రారంభం !

నిఖిలా విమల్ వెరైటీ చిత్రం ప్రారంభం !
X

నిఖిలా విమల్ వెరైటీ చిత్రం ప్రారంభం !అందాల హీరోయిన్ నిఖిలా విమల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం "పెణ్ణు కేస్". ఈ సినిమాకు ఫెబిన్ సిద్ధార్థ్ డైరెక్టర్. ఈ చిత్రం తాజాగా మైసూరులో పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించింది. ఫెబిన్ సిద్ధార్థ్, రెష్మి రాధాకృష్ణన్ సంయుక్తంగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఫెబిన్ గతంలో "భగవాన్ దాసండే రామరాజ్యం" చిత్రానికి కథ రాశారు, ఆ చిత్రాన్ని రషీద్ పరంబిల్ దర్శకత్వం వహించారు.




నిఖిలా విమల్ తెలుగులో అల్లరి నరేశ్ ‘మేడమీద అబ్బాయి’ , మోహన్ బాబు ‘గాయత్రి’ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. ఈ రెండు సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో .. నిఖిల మళ్ళీ తెలుగులో కనిపించలేదు. ఇక ‘పెణ్ణు కేస్’ చిత్రంలో నిఖిలా విమల్‌తో పాటు హకీమ్ షాజహాన్, అజు వర్గీస్, రమేష్ పిషారొడి, ఇర్షాద్ అలీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.






ఈ సినిమాను ఈఫోర్ ఎక్స్‌పెరిమెంట్స్, లండన్ టాకీస్ బ్యానర్లపై ముఖేశ్ ఆర్ మెహతా, రాజేష్ కృష్ణ, సీవీ సరథి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథా నేపథ్యం, శైలి గురించి ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నిఖిలా విమల్ చివరిసారిగా "గెట్-సెట్ బేబీ" చిత్రంలో ఉన్ని ముఖుందన్‌తో జోడీగా నటించింది

Tags

Next Story