నయనతార మలయాళం మూవీ షూటింగ్ పూర్తి !

నయనతార మలయాళం మూవీ షూటింగ్ పూర్తి !
X
, "డియర్ స్టూడెంట్స్ షూటింగ్ పూర్తయింది! మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, అందరికీ కృతజ్ఞతలు. రాబోయే అప్‌డేట్‌ల కోసం ఎదురుచూడండి.. అని పోస్ట్ చేశారు.

సౌత్ బ్యూటీ నయనతార తన తాజా మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ షూటింగ్‌ను పూర్తి చేసింది. నివిన్ పోలీ సహ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, షూటింగ్ ముగింపు సందర్భంగా నయనతార, నివిన్ పోలీ కలిసి సరదాగా ముచ్చటించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ మేకర్స్, "డియర్ స్టూడెంట్స్ షూటింగ్ పూర్తయింది! మా నటీనటులు, సాంకేతిక నిపుణులు, అందరికీ కృతజ్ఞతలు. రాబోయే అప్‌డేట్‌ల కోసం ఎదురుచూడండి.. అని పోస్ట్ చేశారు.

ఈ చిత్రాన్ని సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా, నయనతారతో పాటు నివిన్ పోలీ కూడా సహాయ పాత్రలో కనిపించనున్నారు. దీప్తి, సుబత్రా రాబర్ట్, కిరణ్ కొండ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

2019లో వచ్చిన ‘లవ్ యాక్షన్ డ్రామా’ తర్వాత నయనతార, నివిన్ పోలీ కలిసి నటించిన సినిమా ఇదే కావడం విశేషం. నయనతార చివరగా 2022లో ప్రిత్విరాజ్ సుకుమారన్ నటించిన ‘గోల్డ్’ సినిమాలో కనిపించారు. ఇక త్వరలో మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘యమ్ యమ్ యమ్ యన్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలోనూ ఆమె కనిపించనున్నారు.

నయనతార కెరీర్ విషయానికి వస్తే, ఆమె తదుపరి సినిమా ‘టెస్ట్’, నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా విడుదల కానుంది. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 4 న విడుదల కానుంది. ఇక యష్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలోనూ నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీనికి గీతూ మోహందాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ‘మన్నంగట్టి సిన్స్ 1960’, ‘రాక్కాయి’, ‘మూకుత్తి అమ్మన్ 2’ వంటి సినిమాలు కూడా నయనతార లైన్‌అప్‌లో ఉన్నాయి.

ఇంక నివిన్ పోలీ విషయానికి వస్తే.. ‘యాక్షన్ హీరో బిజు 2’ అనే సీక్వెల్‌తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2016లో వచ్చిన ‘యాక్షన్ హీరో బిజు’ చిత్రానికి ఇది కొనసాగింపుగా వస్తోంది. అలాగే ‘ఫార్మా’ అనే వెబ్‌సిరీస్‌లోనూ అతడు నటిస్తున్నాడు.

Tags

Next Story