మోహన్ లాల్ నుంచి హార్ట్ టచింగ్ విషెస్ !

మలయాళ సినిమా లెజెండరీ నటుడు మమ్ముట్టి తన 74వ పుట్టినరోజును సెప్టెంబర్ 7న జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన దీర్ఘకాల స్నేహితుడు, సహనటుడు మోహన్‌లాల్ హృదయపూర్వక శుభాకాంక్షలతో పెట్టిన పోస్ట్ మరింత ప్రత్యేకమైంది. ఈ ఇద్దరు దిగ్గజాల దశాబ్దాల స్నేహం అభిమానులకు తరతరాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది. మోహన్‌లాల్, మమ్ముట్టిని ప్రేమగా “ఇక్కాకా” (పెద్దన్న) అని పిలుస్తూ, సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ గా ఒక బర్త్‌డే మెసేజ్ షేర్ చేశారు.
వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. ఆ విష్ త్వరగా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. వారు కూడా ఈ మెగాస్టార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, మమ్ముట్టి తన పుట్టినరోజును ఈ ఉదయం సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌తో సెలబ్రేట్ చేశారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఒక శాంతమైన ఫోటోను షేర్ చేస్తూ, అభిమానులు, శ్రేయోభిలాషుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తన క్యాప్షన్‌లో ప్రేమ, మద్దతు, దైవ కృప గురించి రాశారు. ఆ పోస్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఐదు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్‌లో, మమ్ముట్టి మలయాళం, తమిళం, తెలుగు, హిందీలలో 400కు పైగా సినిమాల్లో నటించారు. తన శక్తివంతమైన నటన, బహుముఖ పాత్రలతో పేరుగాంచిన ఆయన, మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలతో పాటు పలు రాష్ట్ర, అంతర్జాతీయ సన్మానాలను అందుకున్నారు. 74 ఏళ్ల వయసులోనూ, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు, విమర్శకుల ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లను సమతుల్యం చేస్తూ, సినిమా పట్ల తన డెడికేషన్ ఏపాటిదో చాటిచెబుతున్నారు. దటీజ్ మమ్ముట్టి.
-
Home
-
Menu