మోహన్ లాల్ కూతురు మాలీవుడ్ ఎంట్రీ !

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ 'తుడక్కం' (ప్రారంభం) అనే చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాతో మాలీవుడ్‌లో ఆమె తన నటనా ప్రస్థానాన్ని ఆరంభిస్తుండటం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మోహన్‌లాల్ వంటి లెజెండరీ నటుడి వారసురాలిగా విస్మయ ఎంట్రీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. ఆయన గతంలో '2018' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
'తుడక్కం' చిత్రాన్ని మోహన్‌లాల్ సన్నిహితుడైన ఆంటోని పెరంబవూర్ ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలను పెంచుతోంది. విస్మయ మొదటి సినిమాకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో కనిపించనుందని తెలుస్తోంది.
విస్మయ మోహన్‌లాల్ కేవలం సినిమా వారసురాలిగా మాత్రమే కాకుండా, ఇప్పటికే తన ప్రతిభతో గుర్తింపు పొందిన రచయిత్రిగా కూడా పేరు తెచ్చుకుంది. 2021లో ఆమె రాసిన 'గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్' అనే పుస్తకం పెంగ్విన్ బుక్స్ ద్వారా విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, ఆమె మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించి.. థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకుంది. ఇలా బహుముఖ ప్రతిభ కలిగిన విస్మయ, 'తుడక్కం' ద్వారా నటిగా తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం గురించి మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, "డియర్ మయాకుట్టి.. 'తుడక్కం'తో నీ మొదటి అడుగు సినిమాతో నీ జీవితకాల బంధానికి తొలి మెట్టు కావాలి" అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ, జూడ్ ఆంథోని లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కిస్తుండడంతో.. సినిమాపై హైప్ ఓ రేంజ్‌లో ఉంది.
మోహన్‌లాల్ కుటుంబం నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రెండో వ్యక్తి విస్మయ. ఆమె సోదరుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఇప్పటికే 'ఆది', 'హృదయం' వంటి సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విస్మయ కూడా తనదైన మార్క్ చూపించేందుకు రెడీ అవుతుండటంతో, మోహన్‌లాల్ అభిమానులు డబుల్ ఎక్స్‌సైట్‌మెంట్‌లో ఉన్నారు. 'తుడక్కం' సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.
-
Home
-
Menu