మోహన్ లాల్ చిత్రానికి సరికొత్త రిలీజ్ డేట్ !

కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం "తుడరుమ్". తరుణ్ మూర్తి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తొలుత 2025 జనవరి 30న విడుదల కావాల్సి ఉండగా.. అనిశ్చిత కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ వార్త ఫ్యాన్స్ మధ్య గట్టి చర్చకు దారి తీసింది. అనంతరం ఈ చిత్రం మే 2025 లో విడుదలవుతుందని అన్నారు. అయితే అవన్నీ వదంతులని తేలింది. తాజాగా చిత్ర బృందం కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది.
ఎక్స్ లో మోహన్‌లాల్ కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ.. ‘తుడరుమ్’ సినిమా 2025 ఏప్రిల్ 25న థియేటర్లలోకి రానుందని ప్రకటించారు. ఇక ఈ చిత్ర ట్రైలర్‌ను 2025 మార్చి 26న విడుదల చేశారు. ఈ మూవీ మోహన్‌లాల్, శోభన లను చాన్నాళ్ళ తర్వాత మళ్లీ తెరపైకి తీసుకువస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి ఎంతో మంది అభిమానులను మెప్పించిన సినిమాల్లో నటించారు. సంవత్సరాల తర్వాత ఈ జంట మళ్లీ కలిసి నటించడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
"తుడరుమ్" కథ ఒక వ్యక్తి తన కార్ పట్ల కలిగిన ప్రేమ, ఆవేశం చుట్టూ తిరుగుతుంది. ఇది ఓ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇంకొకవైపు, మోహన్‌లాల్ నటించిన మరో చిత్రం ‘యల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. డైరెక్టర్ పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ కలెక్షన్లతో పాటు అభిమానుల ప్రశంసలను కూడ సాధించింది.
-
Home
-
Menu