మోహన్ లాల్ ‘వృషభ’ టీజర్ వచ్చేస్తోంది !

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ పాన్-ఇండియా ఇతిహాస చిత్రం ‘వృషభ’. ఈ మూవీ టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్ర టీజర్ సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. టీజర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మోహన్‌లాల్ గంభీరమైన లుక్‌లో కనిపించారు. ప్రముఖ దర్శకుడు నందకిశోర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా సంయుక్తంగా నిర్మించిన ‘వృషభ’ మూవీ భారతీయ తెరపై ఇతిహాస కథనాన్ని పునర్నిర్వచించేలా రూపొందించబడుతోంది. ఈ చిత్రాన్ని కేరళలో ఆశీర్వాద్ సినిమాస్ పంపిణీ చేస్తోంది. భారీ కేన్వాస్, అద్భుతమైన తారాగణంతో దృష్టిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్స్ అండ్ ఎపిక్ కాంబోతో ప్రేక్షకులను అద్భుతమైన దృశ్యాల ప్రపంచంలోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మోహన్‌లాల్‌తో పాటు అనేక మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, గొప్ప ఛాయాగ్రహణం మరియు సాంకేతిక నైపుణ్యంతో ప్రేక్షకులకు అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. మోహన్‌లాల్ జన్మదిన సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా భారీ ఆదరణ పొందింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మోహన్‌లాల్ యోధుడి రూపంలో రాజసమైన లుక్‌లో కనిపించారు.
అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్, సౌండ్ డిజైన్‌తో చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఇటీవలే మోహన్‌లాల్ ఈ చిత్రం డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ ఏడాది దీపావళి రిలీజ్‌గా షెడ్యూల్ చేయబడిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది.
The Battles, The Emotions, The Roar.
— Mohanlal (@Mohanlal) September 16, 2025
Vrusshabha Teaser drops on 18th September.#RoarOfVrusshabha #Vrusshabha #TheWorldofVrusshabha@Connekktmedia @balajimotionpic @FilmDirector_NK #ShobhaKapoor @EktaaRKapoor #CKPadmaKumar #VarunMathur @imsaurabhmishra @abhishekv_77… pic.twitter.com/v1oHpczF7w
-
Home
-
Menu