టాక్సీడ్రైవర్ గా మోహన్ లాల్ ఎమోషనల్ రైడ్ !

‘లూసిఫర్’ సీక్వెల్ ‘ఎల్ 2 : ఎంపురాన్’ మూవీతో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ రేపే వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు. అంతకుముందే ఆయన మరో ఆసక్తికరమైన చిత్రంలో నటించారు. శోభన కథానాయికగా నటించిన ఆ సినిమా పేరు ‘తుడరుం’. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక కుటుంబ కథాంశంతో అభిమానులను అలరించనుంది.
‘తుడరుం’ ట్రైలర్ 1.57 నిమిషాల పాటు సాగుతుంది. సినిమా కథ షన్ముగం అనే ఓ టాక్సీ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. ట్రైలర్ ప్రారంభంలో మోహన్‌లాల్ తన పాఠశాల రోజుల గుర్తులను నెమరువేసుకుంటూ, లెక్కల మాస్టారు అప్పట్లో పిల్లలను పరీక్షించడం, తప్పులు చేస్తే అవమానించడం గురించి చెబుతాడు. అనంతరం మోహన్‌లాల్-శోభన మధ్య వచ్చే కొన్ని ఆసక్తికరమైన ఘర్షణ సన్నివేశాలు ట్రైలర్‌లో ఎలివేట్ అయ్యాయి.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ షన్ముగం అనే టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. అతనికి తన పాత అంబాసిడర్ కారుతో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. అయితే, షన్ముగం ఈ కారును ప్రేమించినా.. ఇతరులు మాత్రం దాన్ని అవమాని స్తుంటారు. కథ ప్రధానంగా కేరళలోని పత్తినంతిట్ట అనే చిన్న కొండ ప్రాంతం నేపథ్యంలో నడుస్తుంది. కుటుంబ సంబంధాలు, చిన్న పట్టణ జీవితంలోని సంతోషాలు, కష్టసుఖాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఆవిష్కంచారు.
శోభన ఈ చిత్రంలో మోహన్‌లాల్ భార్యగా నటిస్తున్నారు. వీరిద్దరూ గతంలో పలు హిట్ చిత్రాల్లో కలిసి నటించగా, చాలా కాలం తర్వాత మళ్లీ ఒకే తెరపై వీరిని చూడటం ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించనుంది. మిగతా పాత్రల్లో ఫర్హాన్ ఫాజిల్, మనియన్ పిళ్ల రాజు, బిను పప్పు, ఇర్షాద్ అలీ, ఆర్షా చాందిని బైజు, థామస్ మాథ్యూ తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 'తుడరుం' చిత్రం మొదట 2025 జనవరి 30న విడుదల కావాల్సి ఉండగా, ఓటిటి ఒప్పంద సమస్యల కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రానికి యూ/ఏ సెన్సార్ సర్టిఫికేట్ లభించింది. మే 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
-
Home
-
Menu