‘దృశ్యం 3’ మూవీ అప్డేట్ ఇచ్చిన మోహన్ లాల్

మాలీవుడ్ సూపర్ స్టార్, ముద్దుగా లాలేట్టన్ అని పిలుచుకునే మోహన్‌లాల్.. మంగళవారం.. సెప్టెంబర్ 23న న్యూఢిల్లీలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోనున్నారు. ఈ వార్త మలయాళ చిత్ర పరిశ్రమలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. పలువురు నటీనటులు, అభిమానులు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
మీడియాతో కొద్దిసేపు మాట్లాడిన మోహన్‌లాల్, తన తదుపరి ప్రాజెక్ట్ ‘దృశ్యం 3’ గురించి కూడా ఒక అప్‌డేట్ ఇచ్చారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ థ్రిల్లర్ చిత్రీకరణ.. అవార్డు వేడుకకు ఒక రోజు ముందే, అంటే ఈ రోజే ప్రారంభం కానుంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ త్వరలోనే వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
మోహన్‌లాల్ దాదాపు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని, భారతీయ చలనచిత్ర పరిశ్రమపై ఆయన చెరగని ముద్రను గుర్తుచేసుకుంటూ అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
-
Home
-
Menu