మోహన్ లాల్ హ్యాట్రిక్ హిట్స్ !

మాలీవుడ్ లెజెండరీ యాక్టర్ మోహన్‌లాల్ 2025లో తన బాక్స్ ఆఫీస్ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించాడు. ‘ఎంపురాన్’, ‘తుడరుం’ సినిమాలతో రెండు భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించగా.. రెండూ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించాయి. లేటెస్ట్ గా ‘హృదయపూర్వం’ సినిమాతో ఈ సీనియర్ నటుడు మరోసారి తన అసమానమైన క్రౌడ్ పుల్లింగ్ సామర్థ్యాన్ని చాటాడు.
ఈ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి, 2025లో మలయాళ సినిమా రంగంలో మూడో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. మోహన్‌లాల్ నటించిన ‘ఎంపురాన్’, ‘తుడరుం’ సినిమాల తర్వాతే ఈ స్థానం దక్కింది. కేరళలో ఈ చిత్రం పోటీ మధ్యలో విడుదలైనప్పటికీ 3.2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది.
‘హృదయపూర్వం’ చిత్రానికి సానుకూల రివ్యూలు వస్తున్నప్పటికీ, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ‘లోక’ సినిమాకు అత్యంత సానుకూల రివ్యూలు , వర్డ్ ఆఫ్ మౌత్ లభిస్తున్నాయి. అయినప్పటికీ, మోహన్‌లాల్ తన వరుస హిట్‌లతో 2025లో మాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌కు భారీ ఊపును అందించాడు. హ్యాట్రిక్ హిట్స్ సాధించి మరోసారి తన సత్తా చాటుకున్నాడు.
-
Home
-
Menu