‘వృషభ’ డబ్బింగ్ పూర్తి చేసిన మోహన్ లాల్

పాన్-ఇండియా చిత్రం 'వృషభ' డబ్బింగ్‌ను మోహన్‌లాల్ పూర్తి చేశారు. నటుడు, దర్శకుడు, రచయిత అయిన శంకర్ రామకృష్ణన్ కూడా ఈ చిత్రంలో కనిపించ నున్నారు. డబ్బింగ్ స్టూడియోలో మోహన్‌లాల్ ఉన్న ఫోటోను నిర్మాత అభిషేక్ వ్యాస్ షేర్ చేస్తూ, డబ్బింగ్ పూర్తయిందని, చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని తెలిపారు. మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది.
మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. నందకిషోర్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్‌లు నిర్మిస్తున్నాయి. మలయాళం, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ పూర్తయింది.
ఈ చిత్రంలో మోహన్‌లాల్ కొడుకుగా శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక నటిస్తున్నారు. తండ్రి-కొడుకుల మధ్య స్నేహబంధం, ప్రతీకార కథ ఈ చిత్రం చెప్పనుంది. సహ్రా ఎస్. ఖాన్, సిమ్రాన్ ఇతర నటీనటులు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శోభ కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథూర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
-
Home
-
Menu