మ్యాథ్యూ థామస్, శ్రీనాథ్ భాసి హీరోలుగా ‘ఉడుంబన్ చోల విజన్’

"ఉడుంబన్ చోల విజన్" చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు అన్వర్ రషీద్ సహాయకుడిగా పనిచేసిన సలాం బుఖారీ.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలన్ రాడ్నీ అనే నూతన రచయిత ఈ సినిమాకు కథను అందించారు. ఈ సినిమాలో మ్యాథ్యూ థామస్, శ్రీనాథ్ భాసి హీరోలుగా నటిస్తున్నారు.
పోస్టర్లో సూట్ ధరించి, నక్క తల కలిగిన వ్యక్తి ఒక ఆఫీస్ కుర్చీలో దర్జాగా కూర్చున్న పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా ద్వారా ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ మలయాళ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో ఇంకా .. దిలీష్ పోతన్, సిద్ధిక్, అశోకన్, బాబురాజ్, సుదేవ్ నాయర్, జినూ జోసఫ్, అభిరాం రాధాకృష్ణన్, శంకర్ ఇందుచూడన్, షాహీన్ సిద్ధిక్, భాగత్ మాన్యూయల్, హస్లీ, చైతన్య ప్రకాశ్, జిజినా రాధాకృష్ణన్, శ్రీందా, నీనా కురుప్, వఫా ఖతీజా, ఆర్జే మురుగన్, ఆదేశ్ దామోదరన్, శ్రీయా రమేశా, అర్జున్ గణేశ్, గాబ్రి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సలాం బుఖారీ, ఆశర్ అమీర్, రియాజ్ కె మొహమ్మద్ సంయుక్తంగా ఏ అండ్ ఆర్ మీడియా ల్యాబ్స్, యూబీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంక మ్యాథ్యూ థామస్ నటించిన మరో చిత్రం "లవ్లీ" విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది ఒక 3డీ ఫాంటసీ కామెడీ డ్రామా. ఒక మాట్లాడే ఈగ చుట్టూ తిరిగే కథతో మే 2న థియేటర్లలో విడుదల కానుంది. అలాగే... శ్రీనాథ్ భాసి ఇటీవల చెంబన్ వినోద్ జోస్‌తో కలిసి "ఇడి మళయాళ కాట్టు" అనే చిత్రంలో కనిపించారు.
-
Home
-
Menu