కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘మార్కో’

ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ మలయాళ సినిమా రాబోయే బుచియాన్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కొరియా ప్రీమియర్‌ను జరుపు కోనుందని చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా తాజాగా నిర్ధారించింది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2024లో అత్యంత విజయవంతమైన మలయాళ చిత్రాల్లో ఒకటిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి, ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ‘ఏ’ రేటెడ్ మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది.
గతంలో పుచియాన్ ఇంటర్నేషనల్ ఫాంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ గా పిలవబడిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్ 1997లో ప్రారంభమై, ఆసియాలో అత్యంత ప్రముఖ జానర్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా మారింది. దక్షిణ కొరియాలోని బుచియాన్లో ప్రతి సంవత్సరం జరిగే ఈ ఈవెంట్ ఫాంటసీ, హారర్, థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్ వంటి ధైర్యమైన, సృజనాత్మక చిత్రాలను ప్రదర్శించడానికి అంకితం చేయబడింది.
బాక్సాఫీస్ మంచి విజయం సాధించినప్పటికీ.. ‘మార్కో’ అతిగా హింస, కథనం తక్కువగా ఉందని తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి టెలివిజన్ ప్రసార లైసెన్స్‌ను నిరాకరించింది. దాని ఓటీటీ విడుదలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వ జోక్యాన్ని కూడా సిఫారసు చేసింది. ప్రస్తుతం సెన్సార్ చేయబడిన ఫార్మాట్లో సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ, విమర్శల కారణంగా నిర్మాత షరీఫ్ ముహమ్మద్ భవిష్యత్ ప్రాజెక్టుల్లో హింసను తగ్గిస్తామని పేర్కొన్నారు.
-
Home
-
Menu