ఓటీటీలోకి మమ్ముట్టి ‘డోమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ కామెడీ చిత్రం "డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్" థియేటర్లలో జనవరి 23, 2025న విడుదలై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక నెరవేరింది. ఈ సినిమా మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
డోమినిక్ అనే మాజీ పోలీస్ అధికారి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. ఒక రోజు, ఒక స్త్రీ.. కనిపించకుండా పోయిన ఒక లేడీస్ పర్స్‌ను , దాని యజమానిని కనిపెట్టి ఇచ్చినట్లయితే.. ఇంటి అద్దె మాఫీ చేస్తానని చెబుతుంది. డోమినిక్ తన ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఆ ఛాలెంజ్‌ని స్వీకరిస్తాడు. అయితే, ఆ పర్స్ వెనుక ఉన్న రహస్యాన్ని అన్వేషిస్తుండగా, ఒక పాత కేసుతో దానికి సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఆ కేసులో ఇద్దరు వ్యక్తులు అదృశ్యమవుతారు. డొమినిక్ పర్స్ యజమానిని కనుగొనడానికి మొదలుపెట్టిన ఈ అన్వేషణ.. చివరికి ఊహించని నిజాలను బయటపెడుతుంది.
ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. నీరజ్ రాజన్ కథను అందించారు. సినిమాటోగ్రఫీ విష్ణు దేవ్, ఎడిటింగ్ ఆంథనీ, సంగీతం దర్భుకా శివ అందించారు. ఇందులో మమ్ముట్టి సీఐ డోమినిక్ పాత్రలో అదరగొట్టారు. అతని అసిస్టెంట్ విక్కీ పాత్రను సురేష్ గోపీ తనయుడు గోకుల్ సురేష్ పోషించాడు. అలాగే సుష్మితా భట్, విజి వెంకటేష్, సిద్ధిక్, వినీత్, విజయ్ బాబు, మీనాక్షి ఉన్నికృష్ణన్, షైన్ టామ్ చాకో ముఖ్య పాత్రల్లో నటించారు.
-
Home
-
Menu