మమ్ముట్టి స్టైలిష్ గేమ్ థ్రిల్లర్ ‘బజూకా’

మమ్ముట్టి స్టైలిష్ గేమ్ థ్రిల్లర్ ‘బజూకా’
X
ఒక పోలీస్ ఆఫీసర్, ‘మిస్టర్ నోబడి’ అనే వ్యాపారవేత్త కలిసి క్రిమినల్‌ యాక్టివిటీస్‌ను అడ్డుకోవడానికి ఒక స్ట్రాటజీ రూపొందిస్తారు.

మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, తమిళ మెగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బజూకా’ సినిమా ఏప్రిల్ 10 న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. 2 నిమిషాలు 32 సెకండ్ల నిడివితో కూడిన ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. మంచి-చెడుల మధ్య జరిగే ఆట ఇది. ఈ కథ నేరాలను అరికట్టే మార్గాన్ని సూచిస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్, ‘మిస్టర్ నోబడి’ అనే వ్యాపారవేత్త కలిసి క్రిమినల్‌ యాక్టివిటీస్‌ను అడ్డుకోవడానికి ఒక స్ట్రాటజీ రూపొందిస్తారు.

ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునేందుకు వారు పలు గేమ్స్ రూపొందిస్తారు. ఇందులో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించగా, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో బాబు ఆంటోని, నీతా పిళ్లై, గాయత్రి అయ్యర్, దివ్య పిళ్లై, షరఫుద్దీన్, జగదీష్, సిద్ధార్థ్ భరతన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీనో డెనిస్ కథ, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి, నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ ప్రభాకర్, దివంగత నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ నిర్వహించారు. సంగీతం సయీద్ అబ్బాస్ అందించారు.

స్టైలిష్ కథనంతో ‘బజూకా’ థ్రిల్లర్ ప్రేమికులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆస్వాదించాలని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి బజూకా మమ్ముట్టికి ఏ రేంజ్ సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Tags

Next Story