ఆసక్తిని రేకెత్తిస్తున్న ‘బజూకా’ ప్రీ రిలీజ్ టీజర్

ఆసక్తిని రేకెత్తిస్తున్న  ‘బజూకా’ ప్రీ రిలీజ్ టీజర్
X
కొత్త డైరెక్టర్ డినో డెనిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గేమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టి పాత్ర పేరు వినోద్ మీనన్. ఆ పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఒక నిమిషం 12 సెకన్ల టీజర్ యాక్షన్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది.

మాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మమ్ముట్టి కొత్త సినిమా "బజూకా" ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కాబోతుంది. విడుదలకు ముందురోజు చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ టీజర్ ను విడుదల చేసింది. కొత్త డైరెక్టర్ డినో డెనిస్ దర్శకత్వంలో రూపొందిన ఈ గేమ్ థ్రిల్లర్ లో మమ్ముట్టి పాత్ర పేరు వినోద్ మీనన్. ఆ పాత్రను పరిచయం చేస్తూ వచ్చిన ఒక నిమిషం 12 సెకన్ల టీజర్ యాక్షన్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండిపోయింది.

టీజర్‌లో మమ్ముట్టి పాత్ర ఒక హై-స్టేక్స్ గేమ్‌లో భాగమై ఉంటాడు. ఆయన స్టైలిష్ యాక్షన్ లుక్స్, టెన్షన్ నిండిన సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో బెంజమిన్ జోషువా అనే పోలీస్ అధికారిగా నటించారు. మమ్ముట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ టీజర్‌ను షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. వినోద్ మీనన్ అండ్ బెంజమిన్ కలిసి ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే మిషన్‌లో పాల్గొంటారు. సినిమా మూడీ విజువల్స్, హై ఇంటెన్సిటీ మ్యూజిక్, రాపిడ్ ఎడిటింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది.

ఈ సినిమాలో మమ్ముట్టి, గౌతమ్ మీనన్‌తో పాటు సిద్దార్థ్ భరతన్, బాబ్ ఆంటోని, హక్కిం షాజహాన్, భామా అరుణ్, సుమిత్ నవల్, దివ్య పిళ్ళై కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘బజూకా’ మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ కొత్త ప్రయోగం. ఓ కొత్త స్టైల్‌గా నిలవనుందనే అంచనాలు ఇప్పటికిప్పుడే మొదలయ్యాయి. మరి ఈ గేమ్ థ్రిల్లర్ మూవీవరకూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.


Tags

Next Story