అమ్మడు అంత డిమాండ్ చేస్తోందా?

ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు క్లిక్ అవుతారో.. ఎవరి జీవితం ఎప్పుడు మారిపోతుందో ఎవరూ ఊహించలేరు. కొంతమంది సంవత్సరాల పాటు కష్టపడి కూడా గుర్తింపు దక్కించుకోలేరు. కానీ మరికొందరికి ఒక్క సినిమాతోనే అదృష్ట ద్వారం తెరుచు కుంటుంది. మలయాళ బ్యూటీ మమిత బైజుకి అలాంటి వరం దక్కింది. సాధారణంగా మలయాళ సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన మమిత ‘ప్రేమలు’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆ చిత్రం ఆమెకు మంచి గుర్తింపుతో పాటు, కొత్త అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలన్న లక్ష్యంతో మమిత ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తోంది.
ప్రస్తుతం ఆమె, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ అనే చిత్రంలో నటిస్తోంది. అదే సమయంలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయకన్’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. మొదట్లో ఒక్కో సినిమా కోసం రూ. 50 లక్షల లోపు రెమ్యూనరేషన్ తీసుకునే మమిత, ఇప్పుడు ఈ క్రేజ్‌ను బేస్ చేసుకుని పారితోషికాన్ని భారీగా పెంచిందట. సమాచారం ప్రకారం, ‘డ్యూడ్’ కోసం ఆమె రూ. 75 లక్షలు తీసుకుంటోంది. ఇక ‘జననాయకన్’ సినిమాకైతే ఏకంగా రూ. 1 కోటి డిమాండ్ చేసిందని టాక్.
ఈ రెండు సినిమాలు కానీ హిట్ అయితే, మమిత క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఆమె రెమ్యూనరేషన్ ఇంకాస్త పెరగడం ఖాయం. "దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి" అన్నట్లు, మమిత ప్రస్తుతం అదే ప్రాక్టీస్ ఫాలో అవుతోంది. స్టార్డమ్ వచ్చిన వెంటనే అవకాశాలను చక్కగా వాడుకుంటూ, తన కెరీర్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాలని భావిస్తోంది.
-
Home
-
Menu