షైన్ టామ్ చాకో పై మరో నటి ఆరోపణలు !

షైన్ టామ్ చాకో పై మరో నటి ఆరోపణలు !
X
ఇప్పుడు షైన్ టామ్ చాకో మళ్లీ మరో వివాదంలో ఇరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటి అపర్ణా జోన్స్, 'సూత్రవాక్యం' సినిమా సెట్లో షైన్ తప్పుడు ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపించింది.

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసులో కోచి, కేరళలో ఇటీవల బెయిల్ పొందిన విషయం సినీప్రపంచాన్ని కుదిపేసింది. డ్రగ్ ఉపయోగంపై ఆరోపణలతో పాటు, ఆయనపై నటిగా గుర్తింపు పొందిన విన్సీ అలోషియస్ లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షైన్ టామ్ చాకో మళ్లీ మరో వివాదంలో ఇరుకున్నాడు. ప్రముఖ మలయాళ నటి అపర్ణా జోన్స్, 'సూత్రవాక్యం' సినిమా సెట్లో షైన్ తప్పుడు ప్రవర్తనకు పాల్పడ్డాడని ఆరోపించింది.

"షైన్ షూటింగ్ సమయంలో ఓ తెల్లటి పొడి తీసుకున్న తర్వాత అసభ్యమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ పొడి ఏమిటో నాకు తెలియదు కానీ దాని ప్రభావంలోనే ఈ ప్రవర్తన చేశాడని అనిపించింది. విన్సీ చెప్పిన ప్రతి మాట నూటికి నూరు శాతం నిజం," అని అపర్ణ పేర్కొన్నారు. "షైన్ నా పక్కన స్పిట్టింగ్ చేశాడు. అది అసహ్యం కలిగించే పరిస్థితి," అని ఆమె తెలిపింది.

ఇక, మలయాళ చిత్రసీమలోని ప్రఖ్యాత సంఘం ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) ఇటీవల షైన్ టామ్ చాకోను తాత్కాలికంగా సినిమాల నుండి తొలగించినట్లు ప్రకటించింది. అయితే, షైన్ ఫెఫ్కా కి విజ్ఞప్తి చేస్తూ తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరాడు. ఫెఫ్కా మాత్రం ఇంటర్నల్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారం మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పలు సంఘాలు మహిళల భద్రతను ముందుంచిన నిర్ణయాలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Tags

Next Story