మల్లూ రెజ్లింగ్ యాక్షన్ కామెడీ ‘చత్తా పచ్చా’

మల్లూ రెజ్లింగ్ యాక్షన్ కామెడీ ‘చత్తా పచ్చా’
X
అర్జున్ అశోకన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, రోషన్ మాథ్యూ, మార్కో ఫేమ్ ఈషాన్ షౌకత్, విశాక్ నాయర్, పూజ మోహన్‌దాస్ కీలక సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు.

డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ రెజ్లింగ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న మలయాళ యాక్షన్ చిత్రం ‘చత్తా పచ్చా: ది రింగ్ ఆఫ్ రౌడీస్’. ఈ సినిమా షూటింగ్ తాజాగా స్టార్ట్ అయ్యింది. అర్జున్ అశోకన్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, రోషన్ మాథ్యూ, మార్కో ఫేమ్ ఈషాన్ షౌకత్, విశాక్ నాయర్, పూజ మోహన్‌దాస్ కీలక సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించనున్నారు. డెబ్యూ డైరెక్టర్ అధ్వైత్ నాయర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ, ఫోర్ట్ కొచ్చిలోని అండర్‌గ్రౌండ్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టైల్ రెజ్లింగ్ క్లబ్‌లో జరిగే కథగా, అందులో భాగమయ్యే క్యారెక్టర్స్ జీవితాల చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాతో ప్రముఖ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు, వీరు సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని ‘కిష్కింధ కాండం’ ఫేమ్ ముజీబ్ మజీద్ అందిస్తున్నారు. టెక్నికల్ టీమ్‌లో సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్, ఎడిటర్ ప్రవీణ్ ప్రభాకర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ కలై కింగ్సన్ ఉన్నారు. స్టోరీని అధ్వైత్ నాయర్ రాయగా, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను సనూప్ తైకూడం రాశారు. సనూప్ గతంలో ‘సుమేష్ అండ్ రమేష్’ రాసి డైరెక్ట్ చేశారు, అలాగే ‘చంక్జ్’, ‘వికృతి’ సినిమాలకు కో-రైటర్‌గా వర్క్ చేశారు.

మేకర్స్ చెప్పినట్టు... ‘చత్తా పచ్చా’లో ఇతర ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖ నటులు నటించనున్నారు. ఈ చిత్రాన్ని రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రితేష్ ఎస్ రామకృష్ణన్, షిహాన్ షౌకత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మమ్ముట్టి కంపనీ బ్యానర్‌పై జార్జ్ సెబాస్టియన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, సునీల్ సింగ్ లైన్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో సినిమా రిలీజ్ కానుంది.

Tags

Next Story