టైటిల్ వివాదంలో ‘జేయస్ కే ’ మలయాళ చిత్రం

మాలీవుడ్ లోని ప్రముఖ సంస్థలు జూన్ 30న తిరువనంతపురంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ప్రాంతీయ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయనున్నాయి. సినిమా సర్టిఫికేషన్‌లో ఇష్టారాజ్యంగా, అతిగా వ్యవహ రిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నిరసన జరగనుంది. ఈ నిరసనకు కారణం.. రాబోయే కోర్ట్‌రూమ్ డ్రామా ‘జేఎస్‌కే - జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా టైటిల్‌తో పాటు ప్రధాన పాత్ర పేరుపై సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేయడం.
కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం జూన్ 27న విడుదల కావాల్సి ఉండగా.. సీబీఎఫ్‌సీ తుది స్క్రీనింగ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో చిత్రం వాయిదా పడింది. డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన వివరాల ప్రకారం.. సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ.. టైటిల్‌లోని “జానకి” అనే పదాన్ని తొలగించాలని, అలాగే ఆ పాత్ర పేరును మార్చాలని డిమాండ్ చేసింది. ఈ చిత్రంలో జానకి అనే పాత్ర లైంగిక వేధింపుల బాధితురాలిగా ఉండటం, ఈ పేరు హిందూ దేవత సీతతో సంబంధం కలిగి ఉండటంపై కమిటీ అభ్యంతరం తెలిపింది.
ఈ సినిమా గతంలో ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ 13+ రేటింగ్ పొందినప్పటికీ, రివైజింగ్ కమిటీ జోక్యంతో దాని విడుదల ఆగిపోయింది. ఈ నిర్ణయం పరిశ్రమలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. కళాత్మక స్వేచ్ఛను కాపాడేందుకు, మతపరమైన సున్నితత్వాల పేరుతో సెన్సార్‌షిప్‌ను వ్యతిరేకిస్తూ సినీ సంస్థలు ఏకమై నిరసనకు సిద్ధమయ్యాయి. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) జనరల్ సెక్రటరీ బి. ఉన్నికృష్ణన్ ఈ నిర్ణయాన్ని ఇష్టారాజ్యం.. అని విమర్శిస్తూ, ఇది పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించారు. “ఇప్పటికే చాలా మంది దర్శకులు, రచయితలు మమ్మల్ని సంప్రదించారు. సాంస్కృతికంగా రూట్ అయిన పేర్లను తమ కథల్లో ఉపయోగిస్తే వివాదాలు తలెత్తుతాయేమోనని ఆందోళన వ్యక్తం చేశారు,” అని ఆయన అన్నారు.
ఈ నిరసనలో ఫెఫ్కా, కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా), డైరెక్టర్స్ యూనియన్ సభ్యులు పాల్గొననున్నారు. డైరెక్టర్స్ యూనియన్ అధ్యక్షుడు రెంజి పణిక్కర్ ఈ నిర్ణయం విస్తృత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. “పాత్రలకు పేర్ల బదులు సంఖ్యలతో గుర్తించాల్సిన పరిస్థితి వస్తుందా? భారతదేశం వైవిధ్యమైన మత భావనల దృష్ట్యా ఏ పేరైనా అభ్యంతరం తెలపవచ్చు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
‘జేఎస్‌కే - జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ చిత్ర నిర్మాతలు సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ జారీలో జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ గతంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రాన్ని జె. ఫణీంద్ర కుమార్ కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రంలో మాధవ్ సురేష్, శ్రుతి రామచంద్రన్, దివ్య పిళ్లై, అస్కర్ అలీ, బైజు సంతోష్, కొట్టాయం రమేష్, షోభి తిలకన్ కూడా నటించారు.
-
Home
-
Menu