మలయాళ చిత్రం ‘ధీరన్’ ఫస్ట్ లుక్ విడుదల !

దేవదత్ శాజీ దర్శకత్వంలో రూపొందుతున్న తొలి చిత్రం "ధీరన్" ఫస్ట్ లుక్ పోస్టర్ తాజాగా విడుదలైంది. పోస్టర్‌లో ప్రధాన తారాగణం ఒక అంబులెన్స్ ముందు నిలబడి ఉంది. అందులో నలుగురు వ్యక్తులు తెల్ల దుస్తులతో కప్పబడిన మృతదేహాన్ని స్ట్రెచర్‌పై మోస్తూ కనిపిస్తున్నారు. దాని పై పూలమాల ఉంచబడి ఉంది.
ఈ చిత్రానికి దేవదత్ శాజీ కథ, స్క్రీన్‌ప్లే కూడా అందించారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన "భీష్మ పర్వం" చిత్రానికి సహ రచయితగా దేవదత్ పేరు తెచ్చుకున్నాడు. రాజేష్ మాధవన్, మనోజ్ కె జయన్, జగదీష్, సిద్ధార్థ్ భారతన్, వినీత్, అశోకన్, సుదీష్, అభిరామ్ రాధాకృష్ణన్, అస్వతి మనోహరన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
లక్ష్మీ వారియర్, గణేష్ మీనన్ ల చీర్స్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వీరు "వికృతి, జానేమాన్ , జయ జయ జయ జయ హే, ఫ్యాలిమీ" వంటి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకున్నారు. దేవదత్ శాజీ 2019 లో "కుంబళంగి నైట్స్" చిత్రానికి మధు సి నారాయణన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత "భీష్మ పర్వం" చిత్రానికి అమల్ నీరద్ తో కలిసి పని చేసి అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా వర్క్ చేశాడు. ధీరన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
-
Home
-
Menu