‘జైలర్’ విలన్ వివాదాస్పద ప్రవర్తన !

మలయాళ నటుడు వినాయకన్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ అధికారిపై చేయి చేసుకున్న ఘటనతో పాటు, 2023లో న్యూసెన్స్ కేసులో అరెస్ట్ కావడం.. జైల్లో కాలం గడపడం వంటి వివాదాలు ఆయనపై తీవ్ర విమర్శలు తెచ్చాయి. అయినా వినాయకన్ తన ప్రవర్తన మార్చుకోక పోవడంతో.. ఇప్పుడు మరోసారి అదే ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు.
తాజాగా వినాయకన్ మద్యం మత్తులో తన పక్కింటి వ్యక్తిని బూతులు తిడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. వీడియోలో ఆయన ఒంటిమీద లుంగీ మాత్రమే ధరించి, అది కూడా ఊడిపోతుండగా చుట్టుకుంటూ బూతులతో విరుచుకుపడుతూ కనిపించాడు. తన ప్రవర్తనను చుట్టుపక్కల వారు ఫోన్ కెమెరాల్లో బంధిస్తుంటే ఆ విషయం గ్రహించలేని స్థితిలో ఉండటం కనిపించింది.
వినాయకన్ రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాతో పాటు పలు మలయాళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. కానీ, తాజా ఘటనలతో సినీ పరిశ్రమకు నష్టం కలిగించాడనే విమర్శలు వస్తున్నాయి. నటుడిగా ఉన్నత స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం అతని అభిమానులను కూడా నిరుత్సాహపరచింది. "నటుడిగా కనీస డీసెన్సీ ఉండాలి, కానీ వినాయకన్‌కు ఆ అవగాహన లేదని" కొందరు ఆరోపిస్తున్నారు.
పదేపదే ఇలాంటి వివాదాస్పద ప్రవర్తనతో ఇండస్ట్రీ పరువు తీస్తున్న వినాయకన్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. "అతడు కెమెరా ముందుకు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని" పలువురు సూచించారు. వినాయకన్ నటనలో ప్రతిభ ఉన్నా, అతని ప్రవర్తన వల్ల పరిశ్రమకు కలిగే నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి తగిన శిక్ష విధించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. వినాయకన్ ను తన పవర్తనకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. తనను క్షమించమంటూ.. సదరు వ్యక్తిని వేడుకుంటూ పోస్ట్ పెట్టాడు.
-
Home
-
Menu