మోహన్ లాల్ సరసన కథానాయికగా ‘మాస్టర్’ బ్యూటీ !

మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ప్రస్తుతం ‘ఎంపురాన్, తుడరుమ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలూ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇవి కాకుండా.. ఇప్పుడు మరో సినిమాకు మోహన్ లాల్ కమిట్ మెంట్ ఇచ్చారు. సీనియర్ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో 'హృదయపూర్వం' అనే సినిమా తెరకెక్కనుంది. ఇందులో కథానాయికగా దళపతి విజయ్ ‘మాస్టర్’ మూవీ లో గ్లామరస్ గా అదరగొట్టిన మాళవిక మోహనన్ నటించనుంది. తమిళ, తెలుగు, హిందీ భాషల చిత్రాల్లో బిజీగా ఉన్న మాళవిక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.యు. మోహనన్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.
ఆంటోని పెరుంబావూర్ నిర్మాణంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరి 10 నుంచి ప్రారంభమవుతుంది. ఈ చిత్రం ప్రత్యేకత ఏమిటంటే.. దర్శకుడు సత్యన్ అంతిక్కాడ్ కుమారులు అఖిల్ సత్యన్, అనూప్ సత్యన్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. కథ అఖిల్ సత్యన్ రాయగా, అనూప్ అసోసియేట్‌గా వ్యవహరిస్తున్నాడు.
సత్యన్ అంతిక్కాడ్ గతంలో తెరకెక్కించిన 'చింతావిష్టయాయి శ్యామల' (తెలుగులో ‘ఆవిడే శ్యామల’) చిత్రంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగీత ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లేటెస్ట్ గా ఆమె నటించిన ‘ఆనంద్ శ్రీబాల’ మంచి విజయం సాధించింది. ‘ప్రేమలు’ చిత్రంలో అమల్ డేవిస్‌గా హాస్యాన్ని పంచిన సంగీత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. నిషాన్, జనార్దనన్, సిద్దిఖ్, లాలు అలెక్స్ తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. గీత రచన మనూ మంజిత్ నిర్వహిస్తున్నారు. కొచిన్, పుణే ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది.
-
Home
-
Menu