‘ఎంపురాన్’ దూకుడు .. మాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్

‘ఎంపురాన్’  దూకుడు .. మాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్
X
తాజాగా విడుదలైన 9వ రోజు కలెక్షన్ల రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్‌’ ను వెనక్కి నెట్టి మాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘యల్2: ఎంపురాన్’ థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. విడుదలైన తొలి రోజునే బీభత్సమైన ఓపెనింగ్స్‌తో ఆరంభించిన ఈ మాగ్నమ్ ఓపస్.. రోజురోజుకూ తన విజయగాథను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా విడుదలైన 9వ రోజు కలెక్షన్ల రిపోర్ట్ ప్రకారం.. ఈ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్‌’ ను వెనక్కి నెట్టి మాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ సినిమా, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చినా, ప్రేక్షకులను విస్తృతంగా ఆకట్టుకోవడంలో మాత్రం విజయవంతమైంది. ఈద్ సెలబ్రేషన్స్ ముగిశాక కలెక్షన్లు కొంత తగ్గినప్పటికీ, ఇప్పటికీ భారీ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది.

9 రోజుల కలెక్షన్ల వివరాలు:

భారత నెట్ కలెక్షన్: రూ. 91.15 కోట్లు

భారత గ్రాస్ కలెక్షన్: రూ. 107.55 కోట్లు

ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్: రూ. 135 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్: రూ. 242.55 కోట్లు

మొత్తం రూ. 242.55 కోట్లు గ్రాస్‌తో ‘L2: ఎంపురాన్’, మంజుమ్మల్ బాయ్స్ (రూ. 241.56 కోట్లు గ్రాస్) ను అధిగమించింది. కేవలం 9 రోజుల్లోనే ఈ రికార్డును బద్దలుకొట్టడం నిజంగా అద్భుతం. ఇప్పుడు ఈ సినిమా దృష్టి రూ. 275 కోట్ల క్లబ్‌ను తాకే దిశగా సాగుతోంది.

‘లూసిఫర్’ కు సీక్వెల్‌గా వచ్చిన ‘యల్2: ఎంపురాన్’ మోహన్‌లాల్‌ను మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చూపిస్తూ, మోల్‌వుడ్‌కు ప్రెజెంటేషన్ పరంగా కొత్త ప్రమాణాలు సెట్ చేసింది. ఇది పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో ఆయన మూడో సినిమా. ఇందులో పృథ్వీరాజ్, టొవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. మార్చి 27న ఈ చిత్రం విడుదలైంది.

Tags

Next Story