అనుకున్న డేట్లోనే ‘ఎల్ 2 : ఎంపురాన్’ !

అనుకున్న డేట్లోనే ‘ఎల్ 2 : ఎంపురాన్’ !
X
సినిమా విడుదల ఈ నెల 27నగా నిర్ధారించబడినప్పటికీ.. వాయిదా పడుతుందనే ఊహాగానాలు కొద్ది రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను ఖండిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

మలయాళ మెగాస్టార్, ది కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఎల్‌2: ఎంపురాన్‌’. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ విజయం సాధించిన ‘లూసిఫర్‌’ ‌కు కొనసాగింపుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది.

సినిమా విడుదల ఈ నెల 27నగా నిర్ధారించబడినప్పటికీ.. వాయిదా పడుతుందనే ఊహాగానాలు కొద్ది రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ఊహాగానాలను ఖండిస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలియచేస్తూ .. ఓ పోస్టార్ షేర్ చేశాడు.

“సరైన సమయమిది. అందరూ జాగ్రత్తగా ఉండండి. విలన్‌ మీ కోసం వచ్చేస్తున్నాడు. తాను సిద్ధంగా లేడని ప్రపంచాన్ని ఒప్పించడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. కానీ అది అతడి గొప్ప ట్రిక్‌!” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో రూపొందిన ‘ఎల్‌2: ఎంపురాన్‌’ మోహన్‌లాల్‌ అభిమానులతో పాటు సినీప్రేక్షకులను తెగ ఉత్కంఠకు గురి చేస్తోంది. భారీ బడ్జెట్‌తో, దృశ్యపరంగా అత్యున్నత స్థాయిలో రూపొందిన ఈ సినిమా అనుకున్న తేదీకే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది.

Tags

Next Story