మోహన్ లాల్ సినిమానే దాటేసింది !

మోహన్‌లాల్ మలయాళ చలనచిత్ర పరిశ్రమలో లెజెండరీ సూపర్‌స్టార్‌గా కొనసాగుతున్నారు. ఆయన సినిమాలు తరచూ రికార్డు బ్రేకింగ్ హిట్స్‌గా మారతాయి. ఈ ఏడాది ప్రారంభంలో "యల్2, తుడరుం" వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన ఆయన గత వారాంతంలో "హృదయపూర్వం" సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా ఆడియన్స్‌ను బాగానే మెప్పించింది.
అదే సమయంలో కల్యాణి ప్రియదర్శన్ నటించిన సూపర్ హీరో సినిమా "లోకహ్ చాప్టర్ 1" మలయాళ సినిమా ప్రియులకు టాప్ ఛాయిస్‌గా నిలిచింది. తెలుగులో "కొత్త లోక"గా విడుదలైన ఈ సినిమా.. కలెక్షన్స్ పరంగా.. బాక్సాఫీస్ వద్ద మోహన్‌లాల్ చిత్రాన్ని అధిగమించడం విశేషం. కల్యాణికి ఈ క్షణం చాలా విశేషం. తన "అంకుల్" మోహన్‌లాల్‌ను ఆడియన్స్ ఆకర్షణలో మించడం ఆమెకు సర్రియల్ అనుభూతిని ఇచ్చింది.
కళ్యాణి తండ్రి, సీనియర్ ఫిల్మ్‌మేకర్ ప్రియదర్శన్, మోహన్‌లాల్‌తో దశాబ్దాల స్నేహం, ప్రొఫెషనల్ బంధాన్ని పంచుకున్నారు. వీరిద్దరూ అనేక క్లాసిక్ సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆసక్తికరంగా, ఒకానొక సమయంలో కల్యాణి మోహన్‌లాల్ కుటుంబంలో కోడలిగా వస్తుందనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే అవి చివరికి సద్దుమణిగాయి. మొత్తం మీద కళ్యాణి .. ‘లోక’ సినిమాతో ‘హృదయపూర్వం’ చిత్రాన్ని అధిగమించిందన్నమాట.
-
Home
-
Menu