జోజు జార్జ్ ‘వరవు’ మూవీ లాంచింగ్ అప్పుడే

జోజు జార్జ్ ‘వరవు’ మూవీ లాంచింగ్ అప్పుడే
X
సెప్టెంబర్ 8న మున్నార్‌లోని తలయార్‌లో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభం కానుంది.

విలక్షణ నటుడు జోజు జార్జ్ నటిస్తున్న భారీ మలయాళ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వరవు'. డైనమిక్ డైరెక్టర్ షాజీ కైలాస్ రూపొందిస్తున్న చిత్రం.. సెప్టెంబర్ 8న మున్నార్‌లోని తలయార్‌లో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాతో ఒకప్పటి తమిళ హీరోయిన్ సుకన్య మాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆమె చివరిగా 2014లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన 'ఆమయుం ముయలుం' లో నటించింది.

జోజు అండ్ షాజీ కాంబోలో ఇది ఫస్ట్ మూవీ. “రివెంజ్ ఈజ్ నాట్ ఎ డర్టీ బిజినెస్” అనే ట్యాగ్‌లైన్‌తో ఈ మూవీ వస్తోంది. స్క్రిప్ట్‌ను షాజీ లాంగ్-టైమ్ కొలాబరేటర్ ఏకే సాజన్ రాశారు. ఆయన 'చింతామణి కొలకేస్', 'రెడ్ చిల్లీస్', 'ధ్రోణ 2010' వంటి షాజీ చిత్రాలకు గతంలో స్క్రిప్ట్‌లు రాసినవాడు. 'వరవు' మూవీని నైసీ రెజీ నిర్మిస్తున్నారు. ఓల్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, జోమీ జోసెఫ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ మున్నార్, మరయూర్, కాంతల్లూర్, తేనీలలో జరుగనుంది.

ఇక జోజు చిత్రాల విషయానికొస్తే, అతను జీతూ జోసెఫ్ దర్శకత్వంలో 'వలదు వశత్తే కళ్ళన్'లో బిజు మీనన్, ఆశా చిత్రంలో ఊర్వశితో కలిసి నటిస్తున్నాడు. అలాగే, తన దర్శకత్వ ప్రవేశం 'పని' మూవీకి సీక్వెల్‌గా 'డీలక్స్'ని డైరెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక దర్శకుడు షాజీ కైలాష్ చివరిగా 2024లో భావన ప్రధాన పాత్రలో 'హంట్' అనే హారర్ చిత్రాన్ని రూపొందించారు.

Tags

Next Story