‘పని’ సీక్వెల్ కు వేరే టైటిల్ ఫిక్స్ చేసిన జోజు జార్జ్

మలయాళ విలక్షణ నటుడు జోజు జార్జ్ తన మొట్ట మొదటి దర్శకత్వ చిత్రం ‘పని’ విజయం తర్వాత.. దాన్ని మూడు భాగాల సినిమా ఫ్రాంచైజ్‌గా, ప్రతి భాగంలో కొత్త కథాంశాలతో... విస్తరిస్తున్నట్టు ప్రకటించాడు. ఇటీవలి మీడియా సంభాషణలో.. రెండో భాగానికి ‘డీలక్స్’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు జోజు వెల్లడించాడు. ఈ చిత్రంలో అతను డీలక్స్ బెన్నీ అనే ప్రధాన పాత్రలో నటిస్తాడు. ‘పని’ సినిమాలాగే.. ఈ కొత్త చిత్రంలో కూడా కొత్త నటులకు ప్రాధాన్యత ఉంటుంది. స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘పని’ చిత్రం 2024 అక్టోబర్‌లో విడుదలై.. త్రిశూర్ నేపథ్యంలో రూపొందిన యాక్షన్‌తో కూడిన రివేంజ్ థ్రిల్లర్‌గా గుర్తింపు పొందింది. సాగర్ సూర్య, జునైజ్ వీ పీ లాంటి నటులు విలన్ పాత్రల్లో గొప్పగా నటించారు. జోజు ఈ చిత్రాన్ని సహ-నిర్మాణం చేసి, తన కెరీర్‌లో అతిపెద్ద కమర్షియల్ సక్సె్స్ సాధించాడు.
ఇదిలా ఉంటే.. జోజు తన తదుపరి చిత్రం ‘ఆశ’ కోసం ఊర్వశితో కలిసి నటిస్తు్న్నాడు. ఇటీవల కొచ్చిలో లాంచ్ అయిన ఈ చిత్రం సఫర్ సనల్ దర్శకత్వ ఆరంగేట్రం. జోజు ఈ సినిమాకి రమేష్ గిరిజ, సఫర్ సనల్‌తో కలిసి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాస్తున్నాడు. అలాగే, జోజు.. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రాబోతున్న థ్రిల్లర్ ‘వలతు వశత్తే కళ్ళన్’ మూవీలో బిజు మీనన్‌తో కలిసి నటిస్తున్నాడు.
-
Home
-
Menu