‘ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్’ అంటున్న ‘ప్రేమలు’ నటుడు !

'ప్రేమలు, బ్రోమాన్స్' వంటి చిత్రాలతో మలయాళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు సంగీత్ ప్రతాప్. ఇప్పుడు 'ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్' చిత్రంతో తొలిసారి హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. 'మిడిల్ క్లాస్ మెంబర్స్' బ్యానర్‌పై అనిరుద్ధ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్యామిన్ గిరీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. పోస్టర్‌లో.. ఆసుపత్రి వాతావరణాన్ని సూచించే విధంగా గ్లాస్ డోర్ ద్వారా చూస్తున్న సంగీత్ ప్రతాప్‌ను చూడవచ్చు. ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'సామర్థ్య శాస్త్రం' వెబ్ సిరీస్‌కు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందించిన నిలీన్ సాండ్ర ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 'కిష్కింధా కాండం', 'రేఖాచిత్రం' వంటి సూపర్‌హిట్ చిత్రాల తర్వాత ముజీబ్ మజీద్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. 'రోమాంచం' బ్లాక్‌బస్టర్ చిత్రానికి ఛాయాగ్రహణం అందించిన సిను తాహిర్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా రూపొందుతున్న 'హృదయపూర్వం' అనే చిత్రంలో జెర్రీ పాత్రలో సంగీత్ ప్రతాప్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌తో పాటు పూర్తి స్థాయి పాత్రలో నటిస్తున్నాడతడు. సినిమా ఎడిటర్‌గా చేస్తున్న సంగీత్ ప్రతాప్ 'ప్రేమలు' చిత్రంతో నటన రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో అమల్ డేవిస్ పాత్రను ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు. కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'బేబీ గర్ల్' చిత్రం సంగీత్ ప్రతాప్ ఆధ్వర్యంలోనే రూపొందుతోంది. ఈ సంవత్సరం మధ్యలో 'ప్రేమలు 2' చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సంవత్సరానికి గాను ఉత్తమ ఎడిటర్‌గా రాష్ట్ర పురస్కారాన్ని సంగీత్ ప్రతాప్ అందుకున్నారు.
-
Home
-
Menu